Posani: పోసాని ఇంటిపై రాళ్లదాడి.. అర్ధరాత్రి రచ్చ.. రచ్చ
పవన్ వర్సెస్ పోసాని మధ్య వార్ కొనసాగుతోంది. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో పోసాని ఫైర్ అయిన విషయం తెలిసిందే.
పవన్ వర్సెస్ పోసాని మధ్య వార్ కొనసాగుతోంది. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో పోసాని ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు రావడంతో.. మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన పోసాని చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే పోసానిపై ప్రెస్ క్లబ్ ముందు పవన్ ఫ్యాన్స్ దాడికి యత్నించడం సంచలనంగా మారింది. అప్పుడు తనకు ప్రాణ హాని ఉందని, ఏం జరిగినా పవన్‌దే బాధ్యత అని పోసాని మీడియా ముందు వ్యాఖ్యానించారు. తాజాగా పోసాని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. అమీర్‌పేట్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్న పోసాని ఇంటిపై రాత్రి 2 గంటల ప్రాంతంలో దుండగులు రాళ్లు విసిరారు. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఈ దాడిలో పోసాని ఇంటి తలుపులు, అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోసాని ఇంటి వాచ్‌మెన్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. గత ఎనిమిది నెలలుగా పోసాని కుటుంబం అక్కడ ఉండటం లేదు. వేరే చోట నివాసముంటున్నారు. ఘటనపై పోసాని వాచ్‌మెన్ సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాశంమైంది.
దాడి జరిగిన ఇంట్లో వాచ్‌మెన్ ఫ్యామిలీ కాపలాగా ఉంటోంది. దాడి జరిగిన సమయంలో వాచ్‌మన్ దంపతులు ఇద్దరూ బయటే నిద్రపోయి ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అరుస్తున్న సమయంలో లేచి పరుగులు పెట్టారు. ఆలోపే రెండు, మూడు ఇటుక రాళ్లను పోసాని ఇంట్లోకి విసిరేశారు ఆ వ్యక్తులు. వాచ్‌మెన్ దంపతులు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. లేదంటే తమకే గాయాలయ్యేవే అని ఆవేదన వ్యక్తం చేశారు వాచ్‌మన్ భార్య శోభ. రెండు రోజుల కిందట సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి పవన్‌పై వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారు పోసాని. అప్పుడే ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్. ఇప్పుడు ఆయన ఇంటిపైనే రాళ్లతో దాడి చేయడం సంచలనంగా మారింది.
Also Read:తూర్పుగోదావరి జిల్లాలో మెగా బ్రదర్స్ పర్యటనలు.. భారీ ఏర్పాట్లు చేస్తోన్న ఫ్యాన్స్
ఈ ఫోటోలో ఉంది నటుడు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కుర్రకారు మెచ్చే నటి.. గుర్తుపట్టండి