AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్. వాతావరణశాఖ బిగ్ అప్డేట్.. ప్రజలకు అలర్ట్..

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.

Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్. వాతావరణశాఖ బిగ్ అప్డేట్.. ప్రజలకు అలర్ట్..
Telangana Rains
Venkatrao Lella
|

Updated on: Jul 02, 2026 | 6:15 PM

Share

నైరుతి రుతుపవనాలు జూలై 02న గుజరాత్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు, ఢిల్లీ అంతటా, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలోని చాలా ప్రాంతాలు, అలాగే రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించాయి.జూలై 2 నాటికి రుతుపవనాల ఉత్తర పరిమితి 22°N/60°E, 22°N/65°E, పోర్బందర్, వల్లభ్ విద్యానగర్, నీముచ్, టోంక్, భివానీ, భటిండా, 32.5°N/70°Eల గుండా వెళుతోంది. రాబోయే 2-3 రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుందనే విషయంపై కీలక సూచనలు జారీ చేసింది.

భారీ వర్షసూచన

జులై 2వ తేదీన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక జులై 3, 4వ తేదీల్లో కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నైరుతి రుతుపవనాల్లో కదలిక కనిపించడం, వేగంగా విస్తరించనుండటంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

Follow Us
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలా?ఈ ఆధ్యాత్మిక అలవాట్లు పాటించండి
మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలా?ఈ ఆధ్యాత్మిక అలవాట్లు పాటించండి
ఆమెకు 72.. అతడికి 22.. కేఫ్‌లో కలిశారు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని
ఆమెకు 72.. అతడికి 22.. కేఫ్‌లో కలిశారు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని