AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూగజీవాల ప్రేమకు ఇదే నిదర్శనం.. తల్లి మృతదేహాన్ని హత్తుకుని కూర్చున్న కోతి పిల్ల

ఈ హృదయవిదారక దృశ్యాన్ని గమనించిన గ్రామస్తులు కొంతసేపు అక్కడే నిలబడి పోయారు. మూగజీవాల మధ్య కూడా ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎంత గొప్పగా ఉంటాయో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొందరు గ్రామస్తులు పసికూన కోతిని జాగ్రత్తగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశా

G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 02, 2026 | 5:04 PM

Share
ప్రేమకు హద్దులు లేవని, ఆ అనుబంధం మనుషులకే కాదు మూగజీవాలకూ సమానంగానే ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో చోటుచేసుకున్న ఓ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పించింది.

1 / 5
గ్రామ శివారులో రోడ్డు దాటుతున్న ఓ తల్లి కోతిని వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కొద్దిసేపటికి తల్లి కోతి మృతి చెందింది. అయితే తన తల్లి ఇక లేదన్న విషయం తెలియని పసికూన కోతి మాత్రం మృతదేహాన్ని విడిచి వెళ్లలేదు. తల్లి ఒడిలోనే చేరి కాసేపు నిద్రపోవడం, అప్పుడప్పుడు తల్లిని మేల్కొలిపేందుకు తాకుతూ ఉండడం అక్కడి వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది.

2 / 5
ఈ హృదయవిదారక దృశ్యాన్ని గమనించిన గ్రామస్తులు కొంతసేపు అక్కడే నిలబడి పోయారు. మూగజీవాల మధ్య కూడా ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎంత గొప్పగా ఉంటాయో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం కొందరు గ్రామస్తులు పసికూన కోతిని జాగ్రత్తగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు.

ఈ హృదయవిదారక దృశ్యాన్ని గమనించిన గ్రామస్తులు కొంతసేపు అక్కడే నిలబడి పోయారు. మూగజీవాల మధ్య కూడా ప్రేమ, ఆప్యాయత, అనుబంధం ఎంత గొప్పగా ఉంటాయో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొందరు గ్రామస్తులు పసికూన కోతిని జాగ్రత్తగా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు.

3 / 5
తల్లి కోసం వెతుకుతూ, ఆమెను వదిలి వెళ్లేందుకు ఇష్టపడని చిన్న కోతి పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల వేగం, అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న రహదారులపై వన్యప్రాణులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

తల్లి కోసం వెతుకుతూ, ఆమెను వదిలి వెళ్లేందుకు ఇష్టపడని చిన్న కోతి పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల వేగం, అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న రహదారులపై వన్యప్రాణులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

4 / 5
మూగజీవాల ప్రాణాలకు కూడా విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఒక్క క్షణంలో తల్లిని కోల్పోయిన ఆ పసికూనకు జరిగిన విషాదం.. చూసిన ప్రతి హృదయాన్ని భారంగా మార్చింది. ప్రేమకు భాష అవసరం లేదని, తల్లి మమతకు హద్దులు ఉండవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!