చపాతీలు మెత్తగా.. పొరలుగా రావాలి అంటే.. ఈ సింపుల్ ట్రిక్ తెలిస్తే చాలు
02-07-2026
Pic credit - Instagram
Phani Ch
రాత్రి పూట చపాతీలు తింటున్నారా ?? కాసేపటికి అవి గట్టిగా అయిపోతున్నాయా అయితే చాలా మెత్తగా, పొరలు పొరలుగా ఎలా చేసుకోవాలో ఒక సూపర్ ట్రిక్ చూద్దాం!
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పుల గోధుమపిండి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ముఖ్యమైన పదార్థం వేయాలి.
అదే 2 టేబుల్ స్పూన్ల తాజా పెరుగు. పెరుగు వేయడం వల్ల చపాతీలు రోజంతా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. పిండిలో పెరుగు బాగా కలిసేలా కలుపుకోవాలి.
పిండిని గట్టిగా కాకుండా మెత్తగా, ఎక్కడా బ్రేక్స్ లేకుండా ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ కలుపుకుని, ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి.
పిండి ముద్ద నుంచి ఒక పెద్ద సైజ్ ఉండను తీసుకోవాలి. పొడిపిండి చల్లుకుంటూ దాన్ని ఒక పెద్ద సైజ్ రోటీలాగా ఒత్తుకోవాలి.
ఇప్పుడు ఆ పెద్ద రొట్టిపై చేతి వేళ్లతో అక్కడక్కడా చిన్నగా నొక్కుతూ హోల్స్ లాగా పెట్టాలి. ఆ తర్వాత నూనె వేసినప్పుడు నొక్కుల్లోకి వెళ్లడం వల్ల చపాతీకి అద్భుతమైన సాఫ్ట్‌నెస్ వస్తుంది.
కొద్దిగా పొడిపిండి చల్లుతూ చల్లుకుంటూ రోల్ లాగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీకి లోపల చాలా పొరలు వస్తాయి.
అలా చుట్టుకున్న రోల్ ముద్దను చాకుతో సమానమైన భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ముద్దను తీసుకుని చతురస్రం షేప్‌లో చపాతీలా కాస్త మందంగా పాముకోవాలి.
స్టవ్ పై పెనం పెట్టి హై ఫ్లేమ్‌లో బాగా వేడి చేయాలి. అర టీస్పూన్ నూనె వేసి రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు కాల్చాలి. అంతే! ఎంతో రుచికరమైన, దూది లాంటి మెత్తటి పొరల చపాతీలు చాలా తక్కువ సమయంలో రెడీ