AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Positive Vibes: మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే.. ఇలా ట్రై చేసి చూడండి

Positive Energy at Home: ఇంట్లో సుఖశాంతులు, సానుకూల వాతావరణం నెలకొనాలంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు.. మన రోజువారీ అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. భారతీయ సంప్రదాయంలో పాజిటివ్ ఎనర్జీ పెంచేందుకు తరతరాలుగా కొన్ని సులభమైన ఆధ్యాత్మిక అలవాట్లు పాటిస్తున్నారు. ఈ అలవాట్లు ఇంటికి ప్రశాంతత, ఆనందం, శుభాలు తీసుకువస్తాయని విశ్వసిస్తారు.

Positive Vibes: మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే.. ఇలా ట్రై చేసి చూడండి
Posive Energy Tips
Janardhan Veluru
|

Updated on: Jul 03, 2026 | 11:55 AM

Share

ఒక ఇళ్లు ప్రశాంతత, అందంగా ఉండటం అనేది కేవలం ఇంటీరియర్ డిజైన్‌పైనే ఆధారపడి ఉండదు.. ఆ ఇంట్లో నివసించే వారి ఆలోచనలు, అలవాట్ల వల్ల వచ్చే ఎనర్జీపై కూడా ఆధారపడి ఉంటుంది. మనం కొందరి ఇళ్లకు వెళ్లినప్పుడు స్పష్టంగా పాజిటివ్ వైబ్స్ చూడొచ్చు.. కొందరి ఇళ్లలో ఏదో నెగటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో ఇంట్లో సుఖశాంతులు, సంతోషం వెల్లివిరిసేందుకు (పాజిటివ్ ఎనర్జీ కోసం) తరతరాలుగా కొన్ని సులభమైన ఆధ్యాత్మిక అలవాట్లను పాటిస్తున్నారు. నెగటివ్ ఎనర్జీ పోయి ఇంటిని నందవనంగా మార్చేందుకు పెద్ద పూజా విధానాలు అవసరం లేదు.. రోజువారీ చిన్న చిన్న అలవాట్లతోనే మీ ఇళ్లు దేవాలయంగా మారిపోతుంది.

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు పాటించాల్సిన అలవాట్లు ఇవే..

1. ప్రార్థనతో రోజును ప్రారంభించండి

ఉదయం నిద్ర లేవగానే రోజంతా బాగుండాలని దేవుడికి చిన్న ప్రార్థన చేసుకోండి. కొత్త రోజును ప్రసాదించినందుకు కృతజ్ఞత తెలుపుతూ ప్రశాంతంగా కొన్ని నిమిషాలు గడపడం వల్ల రోజంతా మానసిక సమతుల్యత ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. ఉదయం, సాయంత్రం దీపారాధన

ఇంటి పూజ గదిలో ఉదయం, సాయంత్రం వేళల్లో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత పవిత్రమైన అలవాటు. దీపపు వెలుగు అజ్ఞానం, చీకట్లను తొలగించి ఆశావాదం, ప్రశాంతతను పెంపొందిస్తుంది.

3. పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవడం

మన పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం దేవునిపై మనకున్న భక్తికి ప్రతీక. వాడిపోయిన పూలను తీసేయడం, దేవుని పటాలను తుడవడం, పూజా సామాగ్రిని సర్దుకోవడం వంటివి ప్రతిరోజూ పూజకు ముందే అలవాటు చేసుకోవాలి.

4. చిన్న మంత్రాలను జపించడం

రోజూ కొద్ది నిమిషాల పాటు ‘ఓం నమః శీవాయ’, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’, ‘గాయత్రీ మంత్రం’ లేదా మీకు ఇష్టమైన ఏదైనా చిన్న మంత్రాన్ని జపించడం వల్ల ఏకాగ్రత పెరిగి, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

5. పవిత్ర గ్రంథాలను చదవడం

భగవద్గీత, రామాయణం, సుందరకాండ, విష్ణు సహస్రనామం వంటి పవిత్ర గ్రంథాల నుండి ప్రతిరోజూ కనీసం ఒక్క శ్లోకం లేదా ఒక పేజీ చదవడం అలవాటు చేసుకోండి. ఇది మన జీవితానికి అవసరమైన ఓర్పును, జ్ఞానాన్ని ఇస్తుంది.

6. భోజనానికి ముందు కృతజ్ఞత

ఆహారం తినే ముందు మనకు అన్నం పెట్టిన ఆ భగవంతునికి, దాన్ని పండించిన రైతన్నలకు, మన కోసం వండిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకోవడం మంచి అలవాటు. ఇది మనం తినే ఆహారాన్ని గౌరవించడాన్ని నేర్పుతుంది.

7. రోజూ కొద్దిసేపు ధ్యానం

రోజూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సాయంత్రం వేళల్లో కానీ 10 నుండి 15 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయండి. శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

8. ఇంట్లో ప్రతికూల మాటలు వద్దు

ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు.. ఇంట్లో అందరితో ప్రేమగా మాట్లాడటం, అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. మనం మాట్లాడే మాటలే మన ఇంటి వాతావరణాన్ని నిర్దేశిస్తాయి.

9. శక్తి కొద్దీ దానధర్మాలు..

సహాయం అవసరమైన వారికి అన్నదానం చేయడం.. పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం.. మీ శక్తి మేరకు దానం చేయడం వంటివి కుటుంబంలో దయాగుణాన్ని పెంచుతాయి.

10. రోజు ముగింపులో ఆత్మపరిశీలన

రాత్రి పడుకునే ముందు ఆ రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఆ రోజు భగవంతుడు ఇచ్చిన మంచికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఏవైనా తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకోవాలని ప్రార్థిస్తూ ప్రశాంతమైన మనస్సుతో నిద్రపోండి. Source

ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక అలవాట్లు మనలో క్రమశిక్షణ, ఓర్పు, మన:శాంతిని నింపుతాయి. కాలక్రమేణా ఇవి కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరిచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. మీ ఇంటినే ఒక దేవాలయంలా మారుస్తాయి. ఇక్కడ ముఖ్యం పర్‌ఫెక్షన్ కాదు, నిలకడే ముఖ్యమని గ్రహించి.. వీటిని అలవరుచుకోవాలి.

Also Read: నీతి కథ: దుష్టులతో వాదనలు వద్దు… దూరంగా ఉండటమే తెలివి!

Follow Us
ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీ వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం కష్టమే
ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీ వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం కష్టమే
ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?
ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?
రూ.1,449కే 6 నెలల పాటు హై-స్పీడ్ వైఫై కనెక్షన్ ఇంటర్నెట్, కాల్స్
రూ.1,449కే 6 నెలల పాటు హై-స్పీడ్ వైఫై కనెక్షన్ ఇంటర్నెట్, కాల్స్
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్?
సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్?
చూపు కోల్పోయినా పుస్తకం చదివిన వృద్ధులు.. ఎలాగంటే
చూపు కోల్పోయినా పుస్తకం చదివిన వృద్ధులు.. ఎలాగంటే
పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్
పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి వోక్స్​వ్యాగన్ ఎలక్ట్రిక్ సైకిల్
సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి వోక్స్​వ్యాగన్ ఎలక్ట్రిక్ సైకిల్
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..