AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Jobs: ఏఐతో లాభమా..? నష్టమా..? రూ.9.3 కోట్ల జాబ్‌కి గూగుల్ ఉద్యోగి రిజైన్..!

ఏఐతో ఉద్యోగాలు పోతున్నాయా? కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయా? ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఇదే అంశం మీద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌లో ఏడాదికి సుమారు రూ.9.3 కోట్ల వేతనం పొందుతున్న ఓ సీనియర్ ఉద్యోగి తన ఉద్యోగానికి రిజైన్ చేసి.. AI స్టార్టప్‌ను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. కృత్రిమ మేధ (AI) ఉద్యోగాలకు సవాళ్లు విసురుతున్నప్పటికీ, అదే సమయంలో కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తోందని చెబుతూ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

AI Jobs: ఏఐతో లాభమా..? నష్టమా..? రూ.9.3 కోట్ల జాబ్‌కి గూగుల్ ఉద్యోగి రిజైన్..!
Google Ex Employee Yousuf Imran
Janardhan Veluru
|

Updated on: Jun 30, 2026 | 4:28 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో లాభమా? నష్టమా? ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఇదే హాట్ టాపిక్. లేఆఫ్స్‌కు ఏఐ కారణమని కొన్ని కంపెనీలు సాకుగా చెబుతున్నాయి. ఏఐ దెబ్బకు ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా తయారుకావొచ్చని కొందరు సొంత జోస్యాలు చెప్పేస్తున్నారు.  అయితే ఈ వాదనను తోసిపుచ్చుతున్న నందన్ నిలేఖని వంటి టెక్ దిగ్గజాలు.. ఏఐ కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుందని విశ్లేషిస్తున్నారు. ఈ చర్చ జరుగుతున్న వేళ.. ఏఐ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు గూగుల్ ఉద్యోగి ఆ కంపెనీకి గుడ్ బై చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

గూగుల్‌లో దాదాపు 1 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.3 కోట్లు) వార్షిక వేతనం పొందుతున్న ఒక ఉన్నత ఉద్యోగి యూసుఫ్ ఇమ్రాన్ తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, సరికొత్త అవకాశాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏఐ కారణంగా ఉద్యోగాల కోత నేపథ్యంలో.. ఏఐ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని.. ఏఐ ఆధారిత కొత్త స్టార్టప్ స్టార్ట్ చేసే యోచనతో గూగుల్ జాబ్‌ని వదిలేసినట్లు యూసుఫ్ ఇమ్రాన్ చెబుతున్నారు.

41 ఏళ్ల యూసుఫ్ ఇమ్రాన్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం బంగ్లాదేశ్ నుండి అమెరికాకు వలస వెళ్లింది. ఇమ్రాన్ 2020లో గూగుల్ కంపెనీలో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా చేరారు. అక్కడ క్లయింట్లకు గూగుల్ AI, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఉపయోగించడంలో సహాయపడేవారు. కమిషన్లు కలుపుకుని గూగుల్ నుంచి గతేడాది ఆయన మొత్తం సంపాదన సుమారు ₹9.3 కోట్లుగా ఉంది. ఇప్పుడు తన ఉద్యోగానికి రిజైన్ చేయానికి కారణాల గురించి ఇమ్రాన్ మీడియా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

AI రంగంలో OpenAI, Anthropic వంటి స్టార్టప్‌లు దూసుకుపోతుండటం చూసి, తాను కూడా AI రంగంలో వెనకబడిపోతానేమో అన్న ఆందోళన ఇమ్రాన్‌లోనూ మొదలైంది. వేరే పెద్ద కంపెనీల్లో స్టాక్ ఆప్షన్స్ ద్వారా జీవితాన్నే మార్చేసేంత డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయని ఆయన గుర్తించారు.  ఇటీవల గూగుల్‌లో జరిగిన ఉద్యోగాల తొలగింపు కూడా ఆయనను ఆలోచింపజేశాయి. ఎంతో ప్రతిభావంతులైన వారిని కూడా కంపెనీ తొలగించడాన్ని చూశాక, వేరొకరి కంపెనీలో ఉద్యోగం చేయడం కంటే తనపై తాను నమ్మకం ఉంచి సొంతంగా ఎదగడం మేలని భావించారు. మీ కెరీర్‌లో ఎక్కడైనా నిలిచిపోయినట్లు అనిపిస్తే సొంతంగా ఏదైనా నిర్మించుకోవడానికి AI ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోందని ఇమ్రాన్ చెప్పారు.

ఇమ్రాన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాదు..కానీ సేల్స్ రంగంలో ఆయనకున్న 20 ఏళ్ల అనుభవంతో సేల్స్ ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారంగా AI ఆధారిత టూల్స్‌ను తయారు చేయాలనుకున్నారు. అందుకోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన గూగుల్‌ను వీడి ‘మ్యాంగోస్టీన్ స్టూడియో’అనే AI ప్రొడక్ట్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇమ్రాన్ ఈ నిర్ణయాన్ని ఆయన ఆవేశంతో తీసుకోలేదు. ఉద్యోగం వదిలేయడానికి ముందే తన బిజినెస్ కోసం సుమారు రూ.1.6 కోట్లు, అలాగే తన హోమ్ లోన్ (Mortgage), వ్యక్తిగత ఖర్చుల కోసం మరికొంత మొత్తాన్ని పొదుపు చేసుకున్న తర్వాతే పూర్తి నిశ్చయంతో అడుగు ముందుకు వేశారు.

ప్రస్తుతం ఒక చిన్న ఇంజనీర్లు, మార్కెటర్ల టీమ్‌తో కలిసి ఆయన ఈ స్టార్టప్‌ను నడుపుతున్నారు. ఎటువంటి బయటి పెట్టుబడులు లేకుండా, సొంత నిధులతోనే ఈ సంస్థను కొంత కాలానికి ముందుకు తీసుకెళ్లాలన్నదే ఆయన లక్ష్యం. కెరీర్‌లో రిస్క్ తీసుకోగలిగే వారికి AI ఇప్పుడు సరికొత్త దారులను చూపిస్తోందని ఆయన బలంగా నమ్ముతున్నారు.

Tech News: ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్‌లో పెట్టి వాడొచ్చా..? నిపుణులు చెప్పేదేంటి?

Follow Us