AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivation: ఈ ఒక్క అలవాటు చాలు.. విజయం వైపు మీ ప్రయాణం మొదలైనట్టే!

Motivation: విజయం అనేది ఒక్కసారిగా దక్కేది కాదు.. ప్రతిరోజూ అలవర్చుకునే మంచి అలవాట్ల ఫలితంగానే జీవితంలో విజయం దక్కుతుంది. ముఖ్యంగా ఉదయపు అలవాట్లు మన ఆలోచనలు, ఉత్పాదకత, విజయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచంలోని అనేక మంది విజయవంతమైన వ్యక్తులు పాటించే కొన్ని ఉదయపు అలవాట్లను మీరు కూడా అనుసరిస్తే, మీ జీవితంలో సానుకూల మార్పులు రావడం ఖాయం. మరెందుకు ఆలస్యం.. విజయం వైపు మీ ప్రయాణాన్ని వెంటనే మొదలుపెట్టేయండి.

Motivation: ఈ ఒక్క అలవాటు చాలు.. విజయం వైపు మీ ప్రయాణం మొదలైనట్టే!
Morning Habits Motivation
Janardhan Veluru
|

Updated on: Jun 16, 2026 | 6:32 PM

Share

విజయం ఒక్క రోజులో దక్కేది కాదు. దానికి నిరంతర కృషి కావాలి. ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న అలవాట్లే మనం జీవితంలో విజయం సాధించేందుకు గట్టి పునాది వేస్తాయి. ముఖ్యంగా ఉదయం లేచిన తర్వాత మనం ఎలా రోజును ప్రారంభిస్తామన్నది మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. జీవితంలో విజయం సాధించిన ఎందరో ప్రముఖుల సక్సెస్ సీక్రెట్ వారి ఉదయపు అలవాట్లే అంటే అతిశయోక్తి కాదు. మరి మీరు కూడా ఈ అలవాట్లను అలవరుచుకుంటే మీ జీవితం మారిపోవడం ఖాయం.

విజయానికి పునాదివేసే ఉదయపు అలవాట్లు..

ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని నిమిషాలు మీ రోజు ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అత్యంత ప్రభావవంతమైన అలవాట్లలో ఒకటి. ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏవో రాసుకోవాలి. తద్వారా ఆ రోజు మీ ప్రాధాన్యత ఏంటో మీకు క్లారిటీ ఉంటుంది. ఇది ఇతర విషయాల మీద మీ దృష్టి మరలగుండా.. లక్ష్యం వైపు ఫోకస్ చేసేందుకు దోహదపడుతుంది.

అలాగే ఉదయం తొందరగా పడక నుంచి లేవడం కూడా ఎంతో ముఖ్యం. సూర్యోదయానికి ముందే నిద్రలేచే వారు జీవితంలో విజయం సాధిస్తారని పెద్దలు చెబుతుండటం వినే ఉంటారు. దీని వల్ల ప్రశాంతమైన వాతావరణంలో మన కోసం కొంత సమయం దొరుకుతుంది. ఇది రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులకు తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచే అలవాటు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నిద్రలేచిన వెంటనే మొబైల్ చూస్తున్నారా..?

ఉదయం లేచిన వెంటనే మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండడం, ఒక గ్లాసు నీరు తాగడం, కొద్దిసేపు నడక లేదా వ్యాయామం చేయడం, ధ్యానం లేదా శ్వాసాభ్యాసం చేయడం వంటి అలవాట్లు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి.

ముఖ్యంగా కృతజ్ఞతా భావంతో రోజును ప్రారంభించడం మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. చిన్న విజయాలను గుర్తించడం, మనకు ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

జీవితంలో విజయం కోసం పెద్ద మార్పులు అవసరం లేదు.. రేపటి నుంచి మొదలు పెడదాం అని వాయిదా వేయకుండా.. వెంటనే ఒక మంచి ఉదయపు అలవాటును ప్రారంభించండి. చిన్న మార్పే అయినా, దాన్ని నిరంతరం కొనసాగిస్తే అది మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను తీసుకురాగలదు.

Also Read: బద్దకం సమస్యను దూది పింజలా ఊదేయండి.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి

Follow Us
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఈ రాశులకు జీవితంలో అనూహ్య పురోగతి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
యజమాని తమ్ముడితో ఎఫైర్ పెట్టకున్న మహిళతోనే అతనికి సాన్నిహిత్యం..
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
కాజీరంగాలో అరుదైన బంగారు పులి దర్శనం.. ఈ ప్రత్యేక రంగు వెనుక ఉన్న
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
మొదట్లో రూ.500 ఇచ్చారు.. ఇప్పుడు ఒకొక్క ఎపిసోడ్‌కు..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
అలసట నుంచి తిమ్మిర్ల వరకు.. అవన్నీ విటమిన్ B12 లోపం వల్లే..
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
NEET PG అడ్మిట్ కార్డు విడుదల తేదీలో మార్పు.. మరికొన్ని గంటల్లోనే
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదానికి గురైన అజిత్ కారు..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక..
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?
ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటంటే?