AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motivation: బద్దకం సమస్యను దూది పింజలా ఊదేయండి.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి

Goodbye Laziness: జీవితాన్ని మార్చే శక్తి మంచి అలవాట్లకు ఉంటాయి. అయితే ఈ మంచి అలవాట్లను శాశ్వితంగా కొనసాగించడం తేలికైన విషయం కాదు. బద్దకమే దీనికి ప్రధాన శత్రువుగా నిలుస్తుంది. అయితే కొన్ని అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. ఈరోజు ప్రారంభించిన ఒక చిన్న మంచి అలవాటు రేపటి విజయవంతమైన జీవితానికి బలమైన పునాదిగా మారవచ్చు.

Motivation: బద్దకం సమస్యను దూది పింజలా ఊదేయండి.. ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి
Goodbye Laziness
Janardhan Veluru
|

Updated on: Jun 13, 2026 | 4:44 PM

Share

మన జీవితంలో విజయం, ఆరోగ్యం, ఆనందం వంటి మంచి ఫలితాలు ఒక్కరోజులో రావు. ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న అలవాట్ల ఫలితంగా అవి వస్తాయి. జీవితంలో ఎదగాలని, విజయం సాధించాలని చాలా మందికి మనసులో ఉన్నా.. ఆ లక్ష్యానికి బద్దకమే ప్రధాన శత్రువుగా ఉంటుంది. కొత్త సంవత్సరం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో జిమ్‌కు వెళ్లాలని, ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలని లేదా రోజుకో పుస్తకం చదవాలని ఆరోగ్యకరమైన కొత్త అలవాట్లు ప్రారంభిస్తారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోయి మళ్లీ పాత జీవితంలోకి వెళ్లిపోతారు. అలాంటి పరిస్థితి రాకుండా..ఒక మంచి అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే బద్ధకం సమస్యను దూదిలా ఈజీగా ఊదేయవచ్చు.

1. ప్రారంభం చాలా చిన్నదిగా ఉండాలి

మీరు అలవర్చుకోవాలనుకున్న ఏ కొత్త అలవాటునైనా చాలా చిన్న స్థాయిలో ప్రారంభించాలి. ఉదాహరణకు రోజుకు ఒక గంట వ్యాయామం చేయాలనే లక్ష్యానికి బదులుగా కేవలం 10 నిమిషాల నడకతో మొదలుపెట్టండి. చిన్న లక్ష్యాలు మనకు ఒత్తిడిని కలిగించవు. అలవాటు అవుతున్న కొద్దీ క్రమంగా వాటిని పెంచుకోవచ్చు. చిన్న లక్ష్యాల ద్వారా మీ మనసుకు ఎలాంటి అలసట, భారం అనిపించదు. కొన్ని వారాలు సులభంగా చేస్తే.. అదే స్థిరమైన అలవాటుగా మారుతుంది.

2. మీకు ఆసక్తి ఉన్నదాన్నే ఎంచుకోండి

మీకు నిజంగా ఆసక్తి ఉన్న అలవాటునే ఎంచుకోవాలి. ఇతరులు చేస్తున్నారని గుడ్డిగా ఫాలో అయిపోకుండా.. మీకు ఆనందాన్ని ఇచ్చే పనిని అలవాటుగా మార్చుకోవడం మంచిది. వ్యాయాయం, పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, మొక్కల సంరక్షణ లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి పనులు ఇందులో భాగం కావచ్చు. మీ దినచర్యను నిశితంగా పరిశీలించి మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకోండి. మీకు ఆసక్తి లేని అంశాన్ని ఎంచుకుంటే కొన్ని రోజులకే అది భారంగా అనిపించి మీరు దాన్ని డ్రాప్ చేసే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

3. పట్టుదలతో కొనసాగించడం

ఒక రోజు అలవాటు తప్పిపోయిందని నిరుత్సాహపడకుండా మరుసటి రోజు మళ్లీ ప్రారంభించాలి. ప్రతిరోజూ చేసిన పనిని క్యాలెండర్ లేదా డైరీలో గుర్తు పెట్టుకోవడం ద్వారా ప్రేరణను కొనసాగించవచ్చు. ఈ చిన్న సంతోషమే మిమ్మల్ని మరుసటి రోజు కూడా అలసట లేకుండా ముందుకు నడిపిస్తుంది.

4. రేపు కాదు.. ఈ రోజే మెదలుపెట్టండి.

మీ జీవితాన్ని మార్చే పెద్ద విజయాలు చిన్న అలవాట్లతోనే మొదలవుతాయి. ఈరోజు మీరు ప్రారంభించే ఒక చిన్న సానుకూల మార్పు రేపటి మీ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే ఆయుధంగా మారగలదు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజే మీకు నచ్చిన ఒక మంచి అలవాటును ప్రారంభించి, విజయవంతమైన జీవితానికి పునాది వేయండి.

Also Read: రతన్ టాటా చెప్పిన ECG ఫార్ములా..ఇది తెలిస్తే మీరు ఓటమికి భయపడరు..!

Follow Us
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ