AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమెకు 72.. అతడికి 22.. కేఫ్‌లో కలిశారు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని ట్విస్ట్..

సమాజంలో అప్పుడప్పుడు వింత పెళ్లిళ్లు జరుగుతుంటాయి. 70 ఏళ్ల వ్యక్తి.. 30 ఏళ్ల వ్యక్తిని పెళ్లిచేసుకోవడం వంటి ఘటనలు గతంలో నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఒక యువకుడు తన కంటే 50 ఏళ్లు పెద్దదైన వృద్ధురాలిని పెళ్లిచేసుకోవడం సంచలనంగా మారింది. అసలు వీరి ప్రేమకథ ఎలా పుట్టింది..? పెళ్లివరకు ఎలా వెళ్లింది..? అనే విషయాలు తెలుసుకుందాం..

ఆమెకు 72.. అతడికి 22.. కేఫ్‌లో కలిశారు.. కట్‌చేస్తే ఎవరూ ఊహించని ట్విస్ట్..
72 Year Old Marries 22 Year Old
Krishna S
|

Updated on: Jul 02, 2026 | 5:19 PM

Share

‘‘ప్రేమకు వయసుతో పని లేదు.. సరిహద్దులు, అడ్డంకులు అసలే ఉండవు’’.. అనే మాటను మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వినూత్న ప్రేమ కథ ఈ మాటను మరోసారి నిజం చేసింది. తనకంటే ఏకంగా 50 ఏళ్లు పెద్దదైన, 72 సంవత్సరాల వృద్ధురాలిని ఒక 22 ఏళ్ల యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఈ విలక్షణ జంట కథ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఆసక్తికరమైన ప్రేమ కథ డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన 22 ఏళ్ల డేనియల్ రామిరెజ్, అమెరికాకు చెందిన 72 ఏళ్ల ఎలియనోర్ హేస్‌లది. డేనియల్ తన కుటుంబం నడుపుతున్న ఒక చిన్న కేఫ్‌లో సహాయం చేసేవాడు. సుమారు రెండేళ్ల క్రితం, అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కోటీశ్వరురాలైన రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఎలియనోర్ హేస్ విహారయాత్ర కోసం పుంటా కానాకు వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కేఫ్‌లో మొదలైన ఆ పరిచయం కాస్తా ప్రేమగా వికసించింది. ఇరు దేశాల సరిహద్దులను దాటి.. గత నెలలో మయామిలో అత్యంత ఆత్మీయుల సమక్షంలో ఒక చిన్న వేడుకలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

ఆమె నా జీవితం.. వయసు కేవలం ఒక సంఖ్యే..

50 ఏళ్ల భారీ వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ, తమ మధ్య ఉన్న బంధం చాలా బలమైనదని ఈ జంట చెబుతుంది. మీడియా ప్రతినిధులతో డేనియల్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘ఆమె నా జీవితం.. మేము ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆమె నన్ను పక్కాగా అర్థం చేసుకుంటుంది. మళ్లీ స్వేచ్ఛగా, సంతోషంగా జీవించడం నేను ఆమెకు నేర్పిస్తున్నాను” అని తెలిపాడు. ఇక ఎలియనోర్ మాట్లాడుతూ.. తన మొదటి భర్త మరణం తర్వాత ఒంటరిగా మారిన తనకు, డేనియల్ రూపంలో ఒక నిజమైన, నిజాయితీ గల భాగస్వామి దొరికాడని ఆనందం వ్యక్తం చేసింది.

నెట్టింట తీవ్ర చర్చ.. రెండుగా చీలిపోయిన నెటిజన్లు..

ఈ పెళ్లి వార్త ఎలియనోర్ పిల్లలను కొద్దిగా గందరగోళంలో పడేసినప్పటికీ, ఇంటర్నెట్‌ను మాత్రం ఊపేస్తోంది. @psychological అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసిన ఈ జంట ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘ఈ ప్రపంచంలో ఇప్పటికీ స్వచ్ఛమైన ప్రేమ ఉందనడానికి వీరే నిదర్శనం, వీరికి నా శుభాకాంక్షలు’’ అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ‘‘ఇది ప్రేమ కాదు బ్రదర్.. ఆ అబ్బాయి కేవలం ఆమె వెనక ఉన్న భారీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చూసి పడిపోయాడు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. జనాలు ఏమనుకున్నా, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మనసులు కలిస్తే చాలని, వయసు అస్సలు అడ్డంకి కాదని ఈ క్రేజీ కపుల్ నిరూపించింది.

Follow Us