వంకాయ పచ్చడి.. మిక్సీ రోలు లేకుండానే 5 నిముషాల్లోనే రెడీ! 

Prasanna Yadla

 02 July  2026

Pic credit - Pinterest

పల్లెటూరి స్టైల్ ఈ వంకాయ పచ్చడి తింటే తింటే అసలు వదలరు అంత రుచిగా ఉంటుంది. 

వంకాయ పచ్చడి

మరి, ఇంక అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

ఎలా తయారు చేయాలంటే

ముందుగా వంకాయను తీసుకుని మీడియం మంటపై పెట్టి దానిని అన్ని వైపులా కాల్చుకోవాలి.

స్టెప్ 1

ఇంకా దీనిలో నాలుగు పచ్చిమిర్చి, మూడు వెల్లుల్లిని తీసుకుని కొంచం దోరగా కాల్చుకోవాలి. 

స్టెప్ 2

ఇంకా ఈ వంకాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత తొక్కను తీసి దాని గుజ్జును ప్లేట్ లోకి తీసుకోవాలి.

స్టెప్ 3

ఇంకా దీనిలో కాల్చిన 10 పచ్చిమిర్చి,  నాలుగు వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, ఉప్పును కూడా వేసి గరిటెతో కలుపుకోవాలి

స్టెప్ 4

ఇంకా  నాలుగు ఉల్లిపాయ, అర కట్ట కొత్తిమీరను కూడా వేసి ఇంకోసారి దీనిని బాగా కలుపుకోవాలి

స్టెప్ 5

చిన్న పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు వేయించండి.

స్టెప్ 6