Telangana: ఒకవైపు వరద బీభత్సం.. మరోవైపు పరవళ్లు తొక్కుతోన్న వాటర్ ఫాల్స్ సోయగాలు..

Telangana: ఒకవైపు వరదలు విలయం సృష్టిస్తుంటే, మరోవైపు జలపాతాలు కనువిందు చేస్తున్నాయ్‌. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతూ..

Telangana: ఒకవైపు వరద బీభత్సం.. మరోవైపు పరవళ్లు తొక్కుతోన్న వాటర్ ఫాల్స్ సోయగాలు..
Waterfalls
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 15, 2022 | 9:18 AM

Telangana: ఒకవైపు వరదలు విలయం సృష్టిస్తుంటే, మరోవైపు జలపాతాలు కనువిందు చేస్తున్నాయ్‌. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారుతూ పరవళ్లు తొక్కుతున్నాయ్‌. తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు వరద బీభత్సం సృష్టిస్తుంటే, మరోవైపు జలపాతాలు జలకళతో సవ్వడి చేస్తున్నాయ్‌. నయాగరా వాటర్‌ ఫాల్స్‌ను తలపిస్తూ అందంగా జాలువారుతున్నాయ్‌. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల, పొచ్చర్ల జలపాతాలకు వరద నీరు పోటెత్తుతోంది. కొండల పైనుంచి ఉధృతంగా జాలువారుతోన్న నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది. పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం నయగారాలను తలపిస్తోంది. దట్టమైన అడవిలో, చుట్టూ పచ్చని కొండల నడుమ వయ్యారంగా వంపులు తిరుగుతూ ఆకర్షణగా నిలుస్తోంది. భీమునిపాదం జాలువారుతోంది. చుక్క నీరు కూడా లేకుండా బోసిపోయిన భీమునిపాదం జలపాతం ఇప్పుడు జలకళతో కళకళలాడుతోంది. ఇక, తెలంగాణ నయాగరాగా పిలుచుకునే బోగత జలపాతం కూడా పాల ధారలతో కనువిందు చేస్తోంది. అలాగే, ముత్యాల ధార, కొంగాల, కిన్నెరసాని జలపాతాలు కూడా జలకళతో ఉట్టిపడుతున్నాయి. జలసవ్వడితో కనువిందు చేస్తోన్న జలపాతాలు ప్రస్తుతం డేంజర్‌గా మారాయ్‌. జలపాతాలన్నీ ఉగ్రరూపం దాల్చడంతో వాటివైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..