హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు…
సంచలనం సృష్టించిన ఈ హత్య ఘటనతో ఆ ప్రాంత వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..సంఘటన స్థలానికి చేరుకున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ మృత దేహాన్ని పరిశీలించారు.. క్లూస్ టీమ్ తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. హత్యకు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. మృతుని కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు..

మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది.. పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు.. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్ళిన దుండగులు అతన్ని అతికిరాతకంగా నరికి చంపారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుకున్నారు..
ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారధిని గుర్తుతెలియని వ్యక్తులు పక్కనే ఉన్న మిర్చి తోటలోకి తీసుకువెళ్లారు.. అతని అతికిరాతకంగా గొడ్డలితో నరికి తలపై మోది చంపారు..
మృతుడు పార్థసారథి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాగా ఆయన ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు.. బైక్ పై వెళ్తున్న అతన్ని పథకం ప్రకారం అడ్డగించిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు
సంచలనం సృష్టించిన ఈ హత్య ఘటనతో ఆ ప్రాంత వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..సంఘటన స్థలానికి చేరుకున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ మృత దేహాన్ని పరిశీలించారు.. క్లూస్ టీమ్ తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. హత్యకు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. మృతుని కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..