AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు మరో లేఖ.. ప్రస్తావించిన అంశాలివే..!

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ కు వరుసగా బహిరంగ లేఖలను సంధిస్తున్నారు. ఇప్పటికే టెట్, రుణమాఫీ, ఇతర అంశాలపై సీఎం ను ప్రశ్నించిన హరీశ్ రావు మరో బహిరంగ లేఖను వదిలారు. అయితే ఈసారి పొద్దు తిరుగుడు పంట మద్దతు ధర గురించి కీలక విషయాలను ప్రస్తావిస్తూ లేఖను రాశారు.

Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు మరో లేఖ.. ప్రస్తావించిన అంశాలివే..!
Revanth Reddy Harish Rao
P Shivteja
| Edited By: |

Updated on: Apr 08, 2024 | 9:07 PM

Share

బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ కు వరుసగా బహిరంగ లేఖలను సంధిస్తున్నారు. ఇప్పటికే టెట్, రుణమాఫీ, ఇతర అంశాలపై సీఎం ను ప్రశ్నించిన హరీశ్ రావు మరో బహిరంగ లేఖను వదిలారు. అయితే ఈసారి పొద్దు తిరుగుడు పంట మద్దతు ధర గురించి కీలక విషయాలను ప్రస్తావిస్తూ లేఖను రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు (sun flower) పంట పండించారని, ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని  హరీశ రావు మండిపడ్డారు.

అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించి మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే దాని ప్రకారమే మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని, రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదని. దీంతో 75 శాతం పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందని లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్రంలో 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తుదని, ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించిందని హరీశ్ రావు అన్నారు. ఈ సారి కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు.

ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కేవలం నాలుగైదు వేలకే తమ పంట అమ్ముకుని నష్టపోవాల్సి వస్తుందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జోక్యం చేసుకుని పొద్దు తిరుగుడు పువ్వు పంటను మొత్తం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి, రైతులు ఆదుకోవాలని హరీశ్ రావు లేఖ లో డిమాండ్ చేశారు.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు