Telangana: మోగుతున్న ప్రమాద ఘంటికలు.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో వేగంగా తగ్గుతున్న భూగర్భ జలాలు..
రోదసిలోకి దూసుకుపోగలడేమో గాని, మనిషి సొంతంగా నీటిని సృష్టించలేడు. తిండీతిప్పలు లేకపోయినా కొన్ని వారాలపాటు నెట్టుకురాగల మానవుడు, గుక్కెడు గంగ లేకుండా ఎన్నాళ్లో బతకలేడు. ఒక్క ముక్కలో, నీరు మనిషికి ప్రాణాధారం. అలాంటి నీటిని ఇష్టంవచ్చినట్టు తోడేసి వాడేస్తున్న మానవాళికి సమీప భవిష్యత్‌లో నీటి కరవు ప్రమాదం పొంచి ఉందన్న నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రోదసిలోకి దూసుకుపోగలడేమో గాని, మనిషి సొంతంగా నీటిని సృష్టించలేడు. తిండీతిప్పలు లేకపోయినా కొన్ని వారాలపాటు నెట్టుకురాగల మానవుడు, గుక్కెడు గంగ లేకుండా ఎన్నాళ్లో బతకలేడు. ఒక్క ముక్కలో, నీరు మనిషికి ప్రాణాధారం. అలాంటి నీటిని ఇష్టంవచ్చినట్టు తోడేసి వాడేస్తున్న మానవాళికి సమీప భవిష్యత్‌లో నీటి కరవు ప్రమాదం పొంచి ఉందన్న నివేదికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. భూగర్భ జలాల డేంజర్ లెవెల్స్ పై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్.
వేగంగా అడుగంటుతున్న భూగర్భజలాలు..
సకలకోటి ప్రాణికి జీవనాధారం నీరు. మానవాళి జీవితమంతా నీటితోనే ముడిపడి ఉంటుంది. అలాంటి నీరు మనకు వర్షం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత ప్రజల అవసరాలు తీర్చేవి భూగర్భ జలాలే. అంతటి ప్రాముఖ్యత ఉన్న నీరు ప్రమాదకరస్థాయిలో పాతాళానికి పడిపోతోంది. హైదరాబాద్‌లో భూగర్భజలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పాతాళగంగ.. ప్రజలకు అందనంత దూరం వెళ్ళిపోతోంది. వేసవి ప్రారంభం నుంచి తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ విడుదల చేసిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షపాతంలో అంతగా మార్పులు లేకపోయినా… భూగర్భ జలాలు మాత్రం ఇంకిపోతున్నాయి. భూమిలోనికి చేరాల్సిన జాలాలు దూరం అవుతున్నాయి. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న నీటి అవసరాలతో భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నాయి. నగరంలో నీ అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లి, మియాపూర్, బండ్ల గూడ, మల్కాజిగిరి, మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, మారెడుపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బాలానగర్, దుండిగల్, కుతుల్లాపూర్, ఉప్పల్, అబ్దుల్లా పూర్ మెట్, రాజేంద్రనర్, పటాన్ చెరు, ఆర్‌సీపురం ప్రాంతాలలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో భూమిపై నుంచి 10 మీటర్లు కిందికి వెళితే తప్ప నీరు అందటం లేదు.
మండుతున్న వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు భాగ్యనగరం మంచినీరు మహాప్రభో అంటూ ఘోష పెడుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో.. అనేక చోట్ల బోర్లు, బావులు ఎండిపోయాయి. చుక్క నీరు కూడా అందని పరిస్థితి. పలు ప్రాంతాల్లో 2,000 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్క నీరు దొరకడం లేదు. అసలే వేసవి.. ఇంకా నీళ్లు ఎండిపోతున్నాయి అంటున్నారు బస్తీ వాసులు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. బోరు బావులు వట్టి పోవడంతో గొంతు తడుపుకునేందుకు జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోందని, మంచి నీళ్ల కోసం డబ్బును నీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా గ్రౌండ్ వాటర్ డేంజర్ లెవెల్స్ వెంటాడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..