Hyderabad: వానొస్తుందని బయటకెళ్లొద్దన్న తల్లి.. మనస్తాపంతో సూసైడ్ చేసుకున్న మహిళ..
నగరంలో నాలుగు ఐదు రోజుల నుండి వానలు దంచి కొడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది అత్యవసరం అయితే తప్ప బయటకెళ్లొద్దని అధికారులు సైతం హెచ్చరించారు.. కానీ వర్షం పడుతుంది బయటకు వెళ్లొద్దు అన్నదానికి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలో నాలుగు ఐదు రోజుల నుండి వానలు దంచి కొడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది అత్యవసరం అయితే తప్ప బయటకెళ్లొద్దని అధికారులు సైతం హెచ్చరించారు.. కానీ వర్షం పడుతుంది బయటకు వెళ్లొద్దు అన్నదానికి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్బిటి నగర్‌కు చెందిన గాయత్రి.. వృత్తిరీత్యా ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. భర్త సువిర్, ఇద్దరు పిల్లలు, ఆమె తల్లి మహాదేవమ్మాతో కలిసి గాయత ఎన్బీటీ నగర్లో నివసిస్తుంది. గాయత్రి, సువీర్ దంపతులకు 14 నెలలు, మూడు నెలల పిల్లలు ఉన్నారు. అయితే గురువారం పెద్దకూతురును బయటకు తీసుకెళ్తాను అని గాయత్రి అనడంతో తల్లి మహదేవమ్మ దానికి అంగీకరించలేదు. పైగా వర్షం పడడంతో ఎక్కడకు వద్దని గాయత్రిని మందలించింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. అయితే, తల్లితో గొడవ అంశంలో మనస్థాపానికి గురైన గాయత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..