Governor Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న గవర్నర్ తమిళి సై.. విద్యార్థులతో భేటీ..

Basara IIIT students: గవర్నర్ తమిళిసై బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులతో భేటీ కానున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు రాత్రి రైలులో బాసరకు వెళ్లనున్నారు.

Governor Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించనున్న గవర్నర్ తమిళి సై.. విద్యార్థులతో భేటీ..
Governor Tamilisai
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 06, 2022 | 3:08 PM

Tamilisai Soundararajan to visit IIIT-Basara: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అధికారులు హామీనివ్వడంతో వారంపాటు ఆందోళనలను వాయిదా వేస్తున్నట్లు విద్యార్థులు ప్రకటించారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులతో భేటీ కానున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ ఈ రోజు రాత్రి రైలులో బాసరకు వెళ్లనున్నారు. బాసర చేరుకున్న అనంతరం మొదట సరస్వతీ దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం తమిళి సై బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భేటీ కానున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై రాత్రి బాసరలోనే బస చేయనున్నారు.

కాగా.. ఇటీవల మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఐఐటీ క్యాంపస్‌ను సందర్శించి.. హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. కానీ ఆ హామీలు ఏవీ అమలు కావడం లేదని విద్యార్థులు ఇటీవల ఆందోళన నిర్వహించారు. మెస్‌ టెండర్లకు నోటిఫికేషన్‌ ఇస్తే సరిపోదని, ఫైనలైజ్‌ చేసే వరకు ఆందోళన విరమించమని పేర్కొన్నారు. కానీ వీసీ హామీతో ఆందోళనను వారంపాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో గవర్నర్‌ తమిళి సై బాసర ఐఐటీ క్యాంపస్‌ను సందర్శించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..