Hyderabad: మందు బాబులకు కిక్కే కిక్కు.. మద్యం అమ్మకాల సమయం పొడిగింపు..!
ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ కీలక మ్యాచ్‌ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయాల సమయాన్ని ప్రత్యేకంగా పొడిగించింది. బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి తర్వాత జరిగే మ్యాచ్‌లను వీక్షించే క్రీడాభిమానుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఉత్తర్వుల ప్రకారం, జూలై 19న జరిగే థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలు తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే జూలై 20న జరిగే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా సాధారణ సమయానికి మించి తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం విక్రయాలు నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేశారు.
ఈ పొడిగించిన సమయం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ పొందిన బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఇతర ప్రాంతాల్లో సాధారణ సమయాలే అమల్లో ఉంటాయి. అయితే, అనుమతించిన సమయం వరకు మాత్రమే మద్యం విక్రయాలు నిర్వహించాలని, శాంతిభద్రతలకు భంగం కలగకుండా నిర్వాహకులు అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత లైసెన్సుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.
Extension of business hours for FIFA Wrold Cup
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..