AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టిఫిన్ బాక్స్‌లో వెండి అలాగే ఉంది.. బంగారం మాత్రం మిస్సింగ్.. అలా ఎలా..

పూజ చేయడం కోసం ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను టిఫిన్ బాక్స్‌లో వేసి పూజగదిలో పెట్టారు. అదే టిఫిన్ బాక్సులో వెండి వస్తువులను కూడా పెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది...

Hyderabad: టిఫిన్ బాక్స్‌లో వెండి అలాగే ఉంది.. బంగారం మాత్రం మిస్సింగ్.. అలా ఎలా..
Pooja Room (Representative image)
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Sep 03, 2024 | 1:03 PM

Share

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజ గదిలోకి వెళ్లి బంగారాన్ని కొట్టేశారు. సుమారు 12 తులాల బంగారాన్ని కొట్టేశారు గుర్తుతెలియని దుండగులు. పూజ గదిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసేందుకు వెళ్లగా కనిపించకపోవడంతో పోలీసులు ఆశ్రయించారు బాధితులు. ఈ ఘటన అత్తాపూర్ డివిజన్‌లోని హైదర్‌గూడలోని గుమ్మకొండ కాలనీలో చోటు చేసుకుంది. అసలు దొంగ ఇంట్లోకి ఎటువైపు నుంచి వచ్చాడు.. ఎవరైనా తెలిసినవారి పనేనా అన్న అంశాలపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.

గుమ్మకొండ కాలనీకి చెందిన ఎల్. ధనుంజయ్ గౌడ్, సులోచన దంపతులు గత 10 ఏళ్ల నుంచి జనప్రియ చౌరస్తాలో పూలు అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు. ఎంతో కష్టపడి రూపాయి.. రూపాయి కూడబెట్టి..  కూతురు పెళ్లి కోసం పలు దఫాలుగా 12తులాల బంగారు కొన్నారు. ఆగస్టు 19న సాయంత్రం 6 గంటలకు పూజ చేయడం కోసం ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను టిఫిన్ బాక్స్‌లో వేసి పూజ గదిలో పెట్టారు. అదే టిఫిన్ బాక్సులో వెండి వస్తువులను కూడా పెట్టారు. మళ్లీ ఆగస్టు 28న ఉదయం 10 గంటలకు పూజ గదిలోని టిఫిన్ బాక్సులో ఉన్న బంగారు వస్తువులను తీసేందుకు వెళ్లగా.. బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెండి వస్తువులు మాత్రం అలాగే ఉన్నాయి.  టిఫిన్ బాక్స్‌లో ఉన్న 2.36 గ్రాముల బంగారు చైన్, 2.5 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 2.10 గ్రాముల బంగారు రింగులు, 2.60 గ్రాముల బంగారు బిస్కెట్లు మొత్తం కలిపి 12 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే దొంగ అయితే మొత్తం టిఫిన్ బాక్స్ ఎత్తుకెళ్లేవాడు. ఇలా వెండివి వదిలేసి.. గోల్డ్ మాత్రమే తీసుకెళ్లడంతో.. రాజేంద్రనగర్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..