Gaddar: గద్దర్‌ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన.. కీలక ప్రకటన విడుదల చేసిన ప్రజా గాయకుడు

ప్రజా యుద్ధనౌక గద్దర్ తెలంగాణలో ఆయన తెలియని వారంటూ లేరు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఎంతోమంది ఉద్యమనికి ఊపిరి పోసిన ఘనత ఆయన సొంతం. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యక్రమాల్లో, భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీని కలిశారు.

Gaddar: గద్దర్‌ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన.. కీలక ప్రకటన విడుదల చేసిన ప్రజా గాయకుడు
Gaddar
Follow us
Ranjith Muppidi

| Edited By: Basha Shek

Updated on: Jul 31, 2023 | 9:02 PM

ప్రజా యుద్ధనౌక గద్దర్ తెలంగాణలో ఆయన తెలియని వారంటూ లేరు. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఎంతోమంది ఉద్యమనికి ఊపిరి పోసిన ఘనత ఆయన సొంతం. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యక్రమాల్లో, భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీని కలిశారు. ఆ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రలోనూ అడుగులు వేశారు. చివరికి తానే ఒక సొంత పార్టీ పెట్టుకొని కేసీఆర్‌పై పోటీ చేస్తా అనడంతో వార్తలలో నిలుస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల పైన ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈక్రమంలో గుండె ఆపరేషన్ చేయించుకున్న గద్దర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. భావోద్వేగపూరితమైన ప్రకటన అది. ఇంతకీ పత్రిక ప్రకటనలో ఏముందంటే..

త్వరలోనే మీ ముందుకు వస్తా..

‘గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా ‘మా భూములు మాకే’ నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేట లోని శ్యామకరణ్ రోడులో అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో ఇటీవల చేరాను. జూలై ఇర వై నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. గుండె చికిత్స నిపుణుల నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. త్వరలోనే మీ ముందుకు వొస్తా’ అని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు గద్దర్‌. దీంతో ఆయన త్వరలోనే కోలుకోవాలని ప్రజా జీవితంలోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.