Kishan Reddy: తెలంగాణ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రంపై నిందలు వేయడం, అసంబద్ధ రాజకీయాలు చేయడం మాని.. ముందుగా విద్యుత్ సంస్థల బకాయిలను చెల్లించాలని హితవు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం రూ. 21 వేల కోట్లకు పైగా బకాయి పడిందన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను కిషన్ రెడ్డి ట్వీట్‌లో వెల్లడించారు. జెన్‌కో కి రూ. 7,388 కోట్లు, డిస్కమ్‌లకు రూ. 11,935 కోట్లు బకాయి పడిందని వివరించారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఇది అత్యధికం అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగా వీటిని క్లియర్ చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఓ వైపు బకాయిలు చెల్లించకుండా.. మరోవైపు కేంద్రంపై అసత్యాలను ప్రచారం చేస్తున్నారిని కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లు నష్టాల్లో ఉన్నాయని, ఈ రెండు డిస్కమ్‌లలో కలిపి రూ. 30,000 కోట్ల నికర విలువ నష్టపోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని కాగ్ రిపోర్ట్ (2020-2021)లోనూ వెల్లడించడం జరిగిందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
బకాయిలు చెల్లించండి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘మన్ కీ బాత్’లో మాట్లారు. దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థల బకాయిలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల బకాయిల కారణంగా విద్యుత్ సంస్థలు కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేయలేకపోతున్నాయని అన్నారు. ఇది అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, విద్యుత్ సంస్థలకు బకాయిలను త్వరగా చెల్లించాలని ప్రధాని మోదీ రాష్ట్రాల ప్రభుత్వాలను అభ్యర్థించారు. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాజకీయాలు చేయకుండా ముందుగా విద్యుత్ సంస్థల బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని కోరారు.
Even the CAG has flagged DISCOM performance in Telangana in its last public report (FY 2020-2021):
– Approx 70% of Telangana State’s PSU losses are because of two DISCOMs – TSSPDCL & TSNPDCL
– Rs. 30,000 crore of net worth erosion has taken place in these two DISCOMs pic.twitter.com/38KZRQ2T0Y
— G Kishan Reddy (@kishanreddybjp) July 31, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..