AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు: హరీష్ రావు..

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్‎నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని, చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు.

చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు: హరీష్ రావు..
Harish Rao
P Shivteja
| Edited By: |

Updated on: Mar 07, 2024 | 10:00 PM

Share

సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహబూబ్‎నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని, చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయన్నారు. పాలమూరు వలసలకు కారణం ఆ రెండు పార్టీలే అన్నారు. గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదు. తాము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామన్నారు హరీష్ రావు. అలాంటి కేసీఆర్‎ను తిట్టడం అవివేకం అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదు. మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దన్నారు.

తన ఎత్తు గురించి సీఎం రేవంత్ మాట్లాడుతారు. తాను కూడా అలా మాట్లాడి విలువ తగ్గించుకోనని చెప్పారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కుసంస్కాంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుంది. భవిష్యత్‎లో రాజకీయాల్లోకి వచ్చే వారికి స్ఫూర్తిగా ఉండాలనే విలువలతో తానుంటానన్నారు. ఎంత ఎత్తు ఉన్నామన్నది కాదు, ప్రజల కోసం ఎంత గట్టిగా పని చేశామన్నది ముఖ్యం అని చెప్పారు. కేసీఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. మహబూబ్‎నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని బతుకులు బాగుపడ్డాయో.. ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయో.. ఎన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయో చూస్తే అర్థమవుతుందని తెలిపారు. పదేళ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు వలసలు వాపస్ చేసింది కేసీఆర్ అని కొనియాడారు. వలసలకు నిలయం నాటి పాలకులు చేస్తే, వ్యవసాయానికి నిలయం చేసింది కేసీఆర్ అని తెలిపారు. తాగు, సాగు, విద్య, పరిపాలనలో పాలమూరును అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆర్ అన్నారు హరీష్ రావు. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క కాలేజీ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయండి. తాము పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేశామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి