Chinna Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం.. ప్రభుత్వంలో కేబినెట్ ర్యాంక్ పదవి దక్కించుకున్న నేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన సీనియర్ నేత చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కేబినెట్ ర్యాంక్ కలిగిన పదవీని కట్టబెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మొదట ఎమ్మెల్సీ చేసి కేబినెట్‌లోకి తీసుకుంటారని భావించిన చివరకు కేబినెట్ హోదాతో కూడిన పదవిలో కూర్పు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన సీనియర్ నేత చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కేబినెట్ ర్యాంక్ కలిగిన పదవీని కట్టబెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ గా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మొదట ఎమ్మెల్సీ చేసి కేబినెట్‌లోకి తీసుకుంటారని భావించిన చివరకు కేబినెట్ హోదాతో కూడిన పదవిలో కూర్పు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కీలక నేత, మాజీ మంత్రి జి చిన్నారెడ్డి తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. కేబినేట్ ర్యాంక్‌లో చిన్నారెడ్డి ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ మొదట ప్రకటించింది. అయితే టికెట్ ఆశించిన మరో నేత మేఘారెడ్డి తిరుగుబాటుతో చివరి నిమిషంలో అభ్యర్థిని మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంలో టికెట్‌ను త్యాగం చేయడంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు చిన్నారెడ్డి కృషి చేశారు. దీంతో వనపర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేఘారెడ్డి భారీ మెజారీటీతో గెలుపొందారు. నాడు సీటు త్యాగం చేసిన సందర్భంలో ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డికి ప్రభుత్వంలో అవకాశం కల్పించింది. మొదట ఎమ్మెల్సీగా చేసి అనంతరం కేబినెట్‌లోకి తీసుకోవడం లేదా రాజ్యసభ అవకాశం కల్పిస్తారని భావించారు. ఈ రెండు కాకుండా కేబినెట్ ర్యాంక్ కల్పిస్తూ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ గా నియామకం చేశారు.
మూడు సార్లు ఎమ్మెల్యే… ఒకసారి మంత్రి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుపరిచిత నేత చిన్నారెడ్డి. వనపర్తి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న చిన్నారెడ్డి, మొదట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలకృష్ణయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. 1989లో మళ్లీ పోటీ చేసి బాలకృష్ణయ్యను ఓడించి, తొలిసారి శాసనసభ మెట్లు ఎక్కారు. అనంతరం 1994లో ఓటమి, 1999, 2004, 2014 ఎన్నికల్లో వరుస విజయం సాధించారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు చిన్నారెడ్డి.
పార్టీ ప్రభుత్వంలోకి రావడంతో గత కొంతకాలంగా పదవీ కోసం వేచిచేస్తున్న సీనియర్ నేతకు ఎట్టకేలకు కేబినెట్ ర్యాంక్ పదవితో సెట్ చేశారు. ఇక త్వరలోనే మరిన్ని నామినేటెడ్ పదవుల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకు అవకాశాలు దక్కవచ్చిన హస్తం శ్రేణులు భావిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




