చెరువులో చనిపోయి నీటతేలిన చేపలు.. చెంచుల పొట్టకొట్టాలని చూసిందెవరు..? కావాలనే విషం కలిపారా..?
నాగర్ కర్నూల్ జిల్లాలోని పోతాపురం చెరువులో వందల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. లింగాల మండలం శ్రీరంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలో...
నాగర్ కర్నూల్ జిల్లాలోని పోతాపురం చెరువులో వందల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. లింగాల మండలం శ్రీరంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పోతాపురం చెరువులో భారీగా చనిపోయిన చేపలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. అది చూసిన చెంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారం కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరంగాపురం గ్రామ పంచాయతీ పరిధి.. సర్వే నెంబర్ 436లో దాదాపు 130 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ పోతాపురం చెరువు. పూర్తిగా అటవీశాఖలో గల పోతాపురం చెరువుపై ఆధారపడి అనేక చెంచు కుటుంబాలు జీవనసాగిస్తున్నాయి. అయితే, కొందరు గ్రామస్తులు కావాలనే చెరువులోని చేపలు చనిపోయేలా కుట్రచేశారని చెంచులు ఆరోపిస్తున్నారు.
పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ చెరువుపై తమకే హక్కు ఉందంటున్నారు ఇక్కడి చెంచులు..ఇంటింటికీ చందాలు వేసుకుని..దాదాపు 8లక్షల వరకు జమచేసుకుని చెరువులో చేపపిల్లలు వదిలామని చెబుతున్నారు. తీరా చేతికి వచ్చిన మత్స్యసంపదను..ఇలా మట్టుబెట్టారని చెంచులు వాపోతున్నారు. ఇప్పటికే చెరువులోని చాలా వరకు చనిపోవటంతో తమకు భారీగా నష్టం జరిగిందని, తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Also Read:
బోరబొండలో ఓ ఇళ్లు.. ఆ ఇంట్లో ఓ ట్రంకు పెట్టె.. అందులో అస్థిపంజరం.. అసలు మిస్టరీ విడిపోయింది..
డబ్బుల వర్షం కురుస్తుందని క్షుద్రపూజలు.. నమ్మారో అంతే సంగతులు.. భారీ మోసం వెలుగులోకి