Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Lottery: దసరా బంపర్ ఆఫర్.. మెగా లక్కీ డ్రాలో ‘ముక్కా.. చుక్కా’..! అబ్బో పండుగ అదిరిపోవాల్సిందే..

Dussehra lucky draw: దసరా వచ్చిందంటే చాలు.. తెలంగాణ అంతటా కూడా జరిగే సందడి అంతా ఇంతా కాదు. విజయ దశమి పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా పల్లె నుంచి పట్నం వరకు కూడా చుక్క, బొక్కా (మద్యం, మాంసాహారం) లేకుండా ఉండలేరు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య పౌరుని నుంచి మొదలు ఉన్నత వర్గానికి చెందిన వారు అంతా కూడా సంబరాల్లో మునిగితేలుతారు.

Dasara Lottery: దసరా బంపర్ ఆఫర్.. మెగా లక్కీ డ్రాలో ‘ముక్కా.. చుక్కా’..! అబ్బో పండుగ అదిరిపోవాల్సిందే..
Dasara Lottery
Follow us
G Sampath Kumar

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 17, 2023 | 3:25 PM

Dussehra lucky draw: దసరా వచ్చిందంటే చాలు.. తెలంగాణ అంతటా కూడా జరిగే సందడి అంతా ఇంతా కాదు. విజయ దశమి పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా పల్లె నుంచి పట్నం వరకు కూడా చుక్క, బొక్కా (మద్యం, మాంసాహారం) లేకుండా ఉండలేరు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని సామాన్య పౌరుని నుంచి మొదలు ఉన్నత వర్గానికి చెందిన వారు అంతా కూడా సంబరాల్లో మునిగితేలుతారు. నాన్ వెజ్ తినడం అలవాటు ఉన్న ప్రతి ఇంటిలోనూ మసాల ఘుమఘుమలాడాల్సిందే.. ఈ పండుగలో మద్యం ప్రియులు కూడా ఫుల్ ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే దసరా వేడుకలను పురస్కరించుకుని ఓ వ్యాపారికి వచ్చిన ఐడియా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వ్యాపారికి ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టేశాడు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు వైరల్ కావడంతో వ్యాపారి ఎంచుకున్న విధానం చూసి నవ్వుకుంటున్న వారు కొందరైతే.. ఆ ఆలోచన ఎలా వచ్చిందబ్బా అంటూ పొగిడేవారూ లేకపోలేదు.. తక్కువ డబ్బులకే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కదా మనమూ కొన్ని టికెట్లు కొంటే పోయేదేముంది..? అని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని అంబేడ్కర్ చౌరస్తాలోని మణికంఠ పాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని దసరా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో టికెట్ రూ.50 మాత్రమే.. ఇది చూసి అందరూ.. టికెట్ల కోసం ఎగబడుతున్నారు. అయితే.. ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది.. ఒక్కో టికెట్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నామని.. ఎక్కువ టికెట్లు కావాలంటే ఇవ్వమని ఆ షాపు యజమాని తెగెసిచెబుతున్నారు. ఇలా.. ఒకరికి ఐదు టికెట్లకు మించి ఇచ్చేది లేదని యజమాని కండిషన్ పెట్టడం కొసమెరుపు..

అయితే, ఈ ఈ నెల 24న తీయనున్న మెగా లక్కీ డ్రాలో గిఫ్ట్‌లు ఏముంటాయని ఆలోచిస్తున్నారా..? అలా అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే.. దసరా సందర్భంగా.. గెలిచిన వారికి ఇచ్చే బహుమతులు ముక్కా.. చుక్కా.. అదేనండి.. గొర్రె, మేక, మద్యం సీసా.. కోడిపుంజు, నాటుకోడి.. ఇలా మసాలా.. మద్యాన్ని ఓనర్ దట్టించేశారు. ఈ లక్కిడ్రాలో ఫస్ట్ ఫ్రైజ్ గొర్రె పొట్టెలు, సెకండ్ ఫ్రైజ్ మేక పొట్టేలు, థర్డ్ ఫ్రైజ్ 100 పైపర్స్ మద్యం బాటిల్, ఫోర్త్ ఫ్రైజ్ కోడి పుంజు, ఫిప్త్ ఫ్రైజ్ నాటు కోడి ఇస్తామని పోస్టర్‌లో ప్రకటించారు.

సాధారణంగా లక్కీ డ్రాలో డబ్బులో, వస్తువులో లేక పోతే టూర్స్ ప్యాకేజీలో ఇచ్చే సాంప్రాదాయాన్ని కొనసాగిస్తుంటారు. కానీ ధర్మపురిలోని మణికంట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మాత్రం దసరా పండగను మనసులో పెట్టుకుని కొత్తతరహా స్కీం స్టార్ట్ చేశారు. డిఫరెంట్‌గా ఆలోచించి అమలు చేసిన ఈ స్కీంతో లక్కీ డ్రాతో తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రమోషన్ వర్క్ కూడా జరుపుకుంటున్నారంటూ స్థానికులు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..