Warangal: రైతు నిద్ర పోతుండగా.. షెల్ఫ్ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా
ప్రజంట్ రెయినీ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వన్యప్రాణులు, సరిసృపాలు ఆవాసాలను కోల్పోయి.. జనావాసాల్లోకి వస్తున్నాయి. అప్రమత్తత లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.. తాజాగా వరంగల్ జిల్లాలో...

వర్షాలు జోరందుకున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు సైతం నీటమునుగుతుండటంతో కొన్ని ప్రాణులు ఆవాసాలు కోల్పోతున్నాయి. దీంతో వనాల్లో ఉండాల్సిన పాములు, ఇతర సరీశృపాలు జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఆహారం, ఆవాసం కోసం ఇళ్ళలోకి చొరబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా దువ్వాడలోని ఓ ఇంట్లోని కిచెన్‌లో నాగుపాము చేరి కుటుంబం మొత్తాన్ని పరుగులు పెట్టించింది. తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది.
వరంగల్ జిల్లా కాసింపల్లి గ్రామం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మయ్య అనే రైతు ఇంట్లోకి అర్ధరాత్రి నాగుపాము చొరబడింది. ఉదయం అంతా పొలం పనులు చేసుకొని రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన లక్ష్మయ్యకు ఎదురుగా షెల్ఫ్‌లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఏంటా అని చూసేసరికి ఓ పెద్ద నాగుపాము కనిపించింది. దెబ్బకు షాకైన లక్ష్మయ్య భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసాడు. లక్ష్మయ్య అరుపులతో ఇంట్లోని వారంతా అలర్టయి బయటకు వచ్చారు. సెల్ప్‌లో నక్కిన పామును చూసి భయపడిన వారు వెంటనే స్థౄనిక స్నేక్ క్యాచర్ రహీంకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న రహీం జాగ్రత్తగా పామును బంధించి అటవీప్రాంతంలో వదిలి పెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
