AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు చనిపోయాడు..అయితే ఏం..నేనున్నా – కోడలిపై దాడి చేసిన కసాయి మామ

కొడుకు చనిపోయాడన్న బాధ ఆ తండ్రిలో కొంచెమైనా లేదు. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న కోడలిని ఆదరించాల్సింది పోయి.. తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టాడు....

కొడుకు చనిపోయాడు..అయితే ఏం..నేనున్నా - కోడలిపై దాడి చేసిన కసాయి మామ
Student Harassment
Ganesh Mudavath
|

Updated on: Feb 23, 2022 | 11:34 AM

Share

కొడుకు చనిపోయాడన్న బాధ ఆ తండ్రిలో కొంచెమైనా లేదు. భర్త చనిపోయి పుట్టెడు దుఖంలో ఉన్న కోడలిని ఆదరించాల్సింది పోయి.. తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. కన్న కూతురులా ఆమె భవిష్యత్‌పై ఆలోచన చేయకుండా అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. కొడుకు చనిపోయాడు.. అయితే ఏం.. నేనున్నాంటూ.. తనను పెళ్లి చేసుకోవాలని ఓ మామ తన కోడలిపై అనాగరికంగా వ్యవహరించాడు. దీనికి నిరాకరించిన కోడలిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన కోడలి తల్లిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో కోడులు తప్పించుకోగా.. ఆమె తల్లికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన.. సమాజంలో మానవ విలువలు పడిపోతున్నాయని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి సోదరి కూతురుతో పెళ్లి చేశాడు. పెళ్లైన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. ఊహించని దుర్ఘటనతో బాధితురాలు తీవ్ర దుఖ సాగరంలో మునిగిపోయింది. అలాంటి సమయంలో చేరదీసి, ఆదుకోవాల్సిన మేనమామ తన దుర్బుద్ధిని బయటపెట్టాడు. కొడుకు చనిపోయాడన్న బాధ ఏ మాత్రం లేకుండా పైశాచికంగా వ్యవహరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, ఎంతకాలం ఒంటరిగా ఉంటావని కోడలిని వేధించడం మొదలు పెట్టాడు. ఇందుకు కోడలు అంగీకరించకపోవడంతో మరింతగా వేధించాడు. ఇక లాభం లేదనుకుని ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది.

విషయం బయటపడిన అనంతరం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన మేనమామ.. కోడలిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. కోడలిని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. తల్లి అడ్డుకునేందుకు వెళ్లడంతో కూతురు తప్పించుకున్నా ఆమె కత్తిపోట్లకు గురైంది. రెండు చోట్ల కత్తితో పొడవడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రురాలిని ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read

Income Tax: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో ఉద్యోగాల పేరుతో అపాయింట్‌మెంట్‌లు.. హెచ్చరించిన ఐటీ శాఖ.

Keerthy Suresh: సూపర్ స్టైలీష్ లుక్‌లోఫ్యాన్స్ గుండెలను కొల్లగొడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు.. గొంతుకు కండువా బిగించి.. మృతి చెందినా వదలకుండా