AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు.. గొంతుకు కండువా బిగించి.. మృతి చెందినా వదలకుండా

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారుతున్నాయి. డబ్బు, ఆస్తి కోసం సొంతవాళ్లనూ హత్య చేసేందుకు వెనుకాడడం లేదు. ప్రాణాల కంటే ఆస్తే ముఖ్యం..

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు.. గొంతుకు కండువా బిగించి.. మృతి చెందినా వదలకుండా
Death
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 23, 2022 | 12:03 PM

Share

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారుతున్నాయి. డబ్బు, ఆస్తి కోసం సొంతవాళ్లనూ హత్య చేసేందుకు వెనుకాడడం లేదు. ప్రాణాల కంటే ఆస్తే ముఖ్యం అన్నట్లు కొందరు ప్రబుద్ధులు వ్యవహరిస్తున్నారు. కలకాలం తోడుండాల్సిన భర్త ఆస్తి విషయంలో తలెత్తిన విభేదాలతో భార్యను దారుణంగా హత్య చేశాడు. ముందస్తు పథకం ప్రకారం గొంతుకు కండువా బిగించాడు. మృతి చెందినా.. ఆక్రోశం చల్లారక ఆమె మెడలోని తాళి బొట్టును గొంతుకు బిగించాడు. తర్వాత తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరించాడు. మృతురాలి పెద్ద కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని విచారించారు. విచారణలో తన భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామన్నారు.

ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలంలోని గురిజేపల్లికి చెందిన పాలెపు శ్రీహరిరావు, సుబ్బాయమ్మలు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కొంతకాలం తర్వాత శ్రీహరి.. తన అక్క కూతురిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో సుబ్బాయమ్మ పేరుపై ఉన్న పొలాన్ని పెద్ద కుమార్తె కొడుకు పేరిట రాసింది. విషయం తెలుసుకున్న శ్రీహరిరావు, చిన్నకుమార్తె సుజాత, అల్లుడు బ్రహ్మయ్య ఆమెతో ఘర్షణకు దిగారు. ఈ సంఘటనపై సంతమాగులూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విభేదాలకు కారణంగా ఉన్న తన భార్యను చంపాలని శ్రీహరిరావు నిర్ణయించాడు. ముందస్తు పథకం ప్రకారం ఈ నెల 14న ఇంట్లో నిద్రిస్తున్న సుబ్బాయమ్మ మెడ చుట్టూ కండువాతో గొంతు బిగించి చంపాడు. అయినప్పటికీ ఆక్రోశం తగ్గక ఆమె మెడలోని తాళి బొట్టును గొంతుకు బిగించాడు.

తెల్లారిన తరువాత స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. పెద్దకుమార్తె రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శ్రీహరిరావు వ్యవహారం పై అనుమానం వ్యక్తం చేశారు. తమదైన శైలిలో విచారణ చేయగా.. భర్తే హత్య చేసినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. హత్య విషయంలో నిందితుడైన శ్రీహరిరావును మంగళవారం అరెస్టు చేశారు.

Also Read

Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్‌ పోస్ట్‌ !! వీడియో

Ashu Reddy: మరోసారి ట్రోలర్లకు అడ్డంగా దొరికిపోయిన అషూ రెడ్డి.. ఈసారి ఎందుకంటే..

Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు.. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరంటే..