AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Raghupathi: నరేశ్ మాజీ భార్య మోసాల చిట్టా చాంతాడంత.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..

Ramya Raghupathi: కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను పరిచయం చేసుకొని వారి నుంచి భారీగా డబ్బు లాగిన శిల్పా చౌదరి (Shilpa Chowdary) ఉదంతం మరిచిపోకముందే హైదరాబాద్‌లో ఇలాంటి వ్యవహరమే మరొకటి వెలుగులోకి వచ్చింది. సీనియర్‌ నటుడు నరేశ్‌..

Ramya Raghupathi: నరేశ్ మాజీ భార్య మోసాల చిట్టా చాంతాడంత.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
Ramya
Narender Vaitla
|

Updated on: Feb 23, 2022 | 11:02 AM

Share

Ramya Raghupathi: కిట్టీ పార్టీల పేరుతో సంపన్న మహిళలను పరిచయం చేసుకొని వారి నుంచి భారీగా డబ్బు లాగిన శిల్పా చౌదరి (Shilpa Chowdary) ఉదంతం మరిచిపోకముందే హైదరాబాద్‌లో ఇలాంటి వ్యవహరమే మరొకటి వెలుగులోకి వచ్చింది. సీనియర్‌ నటుడు నరేశ్‌ (Actor Naresh) మాజీ భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) చీటింగ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. హైదరాబాద్‌ టు బెంగళూరు అన్నట్లు సాగిన ఆమె మోసాలకు సంబంధించిన చిట్టా చాంతాడంత ఉంది. పోలీసుల దర్యాప్తులో ఎన్నో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. నరేశ్‌ పేరు చెప్పి ఎంతో మంది మధ్య తరగతి వారిని నిండా ముంచారు రమ్య. ఒక్కరు.. ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బాధితులు పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు.. ఏకంగా బెంగళూరు వరకు తన ఫైనాన్షియల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది రమ్య రఘుపతి. మాయలేడి ఎపిసోడ్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేశ్ ఆస్తులను చూపిస్తూ.. మిడిల్‌ క్లాస్ జనాల దగ్గర పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంది. తిరిగి చెల్లించమంటే ముఖం చాటేస్తోంది. హైదరాబాద్, బెంగళూరులో పెద్ద మొత్తంలో ఆస్తులను చూపి.. జనాల దగ్గర నుంచి డబ్బులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొంత మొత్తం అప్పులు, లేదంటే తన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలని తెలిసిన వారి దగ్గరు డబ్బులు లాగేసింది.

ఇక రమ్య కేవలం నరేశ్‌ పేరును మాత్రమే కాకుండా, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తే ఈ రమ్య రఘుపతి. అలా ఆయన పేరుతో మోసాలు పాల్పడింది. అనంతపురం, హిందూపురంలో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలుస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన మోతిమహల్ తనదే అంటూ రమ్య వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. మారియట్ హోటల్‌ వాటా ఉందని ప్రచారం చేసుకుంది. రంభా ఉన్నత్ ఏరొమాటిక్ సర్వీస్ పేరిట వసూళ్లకు పాల్పడింది. సాయిల్ టూ సోల్ ఆర్గనైజషన్ పేరుతో భారీగా వసూలు చేసింది రమ్య. ఈమెపై ఇప్పటి వరకు ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో రమ్యపై కేసు నమోదైంది.

నాకు ఎలాంటి సంబంధం లేదు: నరేశ్‌

ఇక ఈ విషయంపై రమ్మ మాజీ భర్త నటుడు నరేశ్‌ స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘ఆరేళ్లుగా రమ్య, నేను దూరంగా ఉంటున్నాము. ఏం జరుగుతుందో నా కుటుంబానికి తెలియదు. ఆర్థిక వ్యవహారాల్లో నా కుటుంబం ఎప్పుడు ఇన్‌వాల్వ్ కాలేదు. ఈ మోసాలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు. గతంలోనూ ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు తెలిసి పబ్లిక్‌ నోటిస్‌ ఇచ్చాను’ అని చెప్పుకొచ్చారు. ఇక తొమ్మిదేళ్ల క్రితం రమ్యను వివాహం చేసుకున్న నరేశ్‌.. ఆరేళ్ల క్రితమే విడిపోయినట్లు తెలిపారు. ఇలాంటి సమస్యలు గుర్తించి గౌరవంగా ఇద్దరం విడిపోయామని క్లారిటీ ఇచ్చారు.

Also Read: Viral Video: వామ్మో.. ట్రాఫిక్‌లో సైకిల్‌పై అదిరిపోయే స్టంట్ !! వీడియో

Old Pension Scheme: పాత పెన్షన్‌ విధానం తీసుకురానున్నారా.. అసులు OPS అంటే ఏమిటి..

ఆటో ఎక్కిన యువతితో అసభ్యంగా.. గమ్య స్థానంలో ఆపకుండా.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి