AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆటో ఎక్కిన యువతితో అసభ్యంగా.. గమ్య స్థానంలో ఆపకుండా.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి

గమ్యస్థానానికి చేర్చాల్సిన ఓ ఆటో డ్రైవర్.. ఆటో ఎక్కిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటివద్ద దింపకుండా ముందుకు వేగంగా వెళ్తుండటంతో బాధితురాలికి...

ఆటో ఎక్కిన యువతితో అసభ్యంగా.. గమ్య స్థానంలో ఆపకుండా.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి
Murder
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 23, 2022 | 12:04 PM

Share

గమ్యస్థానానికి చేర్చాల్సిన ఓ ఆటో డ్రైవర్.. ఆటో ఎక్కిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటివద్ద దింపకుండా ముందుకు వేగంగా వెళ్తుండటంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. ఇంటి వద్ద ఉన్న తన సోదరునికి సమాచారం అందించింది. అతను పోలీసుల సహాయంతో నిర్జన ప్రదేశానికి చేరుకుని ఆమెను రక్షించారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. గుంటూరు(Guntur) జిల్లా వినుకొండ(vinukonda) కు చెందిన బూసిరాజు చిన వెంగళరావు.. పట్టణంలో ఆటో నడుపుతున్నాడు. ఈ నెల17న స్తూపం కూడలిలో రాత్రి 9 గంటల తర్వాత డ్రైవర్స్‌ కాలనీకి చెందిన ఓ యువతి అతని ఆటో ఎక్కింది. గమ్య స్థానానికి చేరుకున్నప్పటికీ.. ఆటో ఆపకపోవడంతో యువతికి అనుమానం వచ్చింది.

ఇంటి వద్ద ఉన్న తన సోదరునికి చరవాణి నుంచి సందేశం పంపింది. దీంతో అప్రమత్తమైన అతను.. పోలీసుల సహకారంతో నరసరావుపేట రోడ్డులోని బాలాజీ ఎస్టేట్‌ పక్కన నిర్జన ప్రదేశంలోకి చేరుకుని ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆటో డ్రైవర్ చిన వెంగళరావు కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం వెల్లటూరు రోడ్డులో అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ ఒకరిద్దరి పట్ల ఇలాగే అసభ్యంగా ప్రవర్తించినట్లు తమ విచారణలో వెల్లడైందని వెల్లడించారు.

Also Read

Viral Photo: ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్!

Tamil Nadu: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీదే హవా.. చెన్నైలో డీఎంకే క్లీన్‌స్వీప్‌

Prashant Kishor: రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మ కాకూడదు.. పీకే పై తృణమూల్‌ ఎంపీ ఫైర్‌..

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..