విద్యార్థిని తీవ్రంగా కొట్టిన లెక్చరర్.. మనస్తాపంతో బాలుడి ఆత్మహత్యాయత్నం.. కారణమేంటంటే

విద్యార్థులు అల్లరి చేస్తే వారిని సున్నితంగా మందలించాల్సిన ఆ అధ్యాపకుడు(Lecterur).. తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. విద్యాబుద్ధులు నేర్పి మంచి చెడు చెప్పాల్సిన

విద్యార్థిని తీవ్రంగా కొట్టిన లెక్చరర్.. మనస్తాపంతో బాలుడి ఆత్మహత్యాయత్నం.. కారణమేంటంటే
Teacher Beating
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Feb 23, 2022 | 12:04 PM

విద్యార్థులు అల్లరి చేస్తే వారిని సున్నితంగా మందలించాల్సిన ఆ అధ్యాపకుడు(Lecterur).. తనలోని క్రూరత్వాన్ని బయటపెట్టాడు. విద్యాబుద్ధులు నేర్పి మంచి చెడు చెప్పాల్సిన ఆ లెక్చరర్ కర్కశంగా వ్యవహరించాడు. అల్లరి చేస్తున్నాడన్న కారణంతో జూనియర్ కళాశాల విద్యార్థిని చితకబాదాడు. విచక్షణ మరిచి తీవ్రంగా కొట్టాడు(beating). తనను కొట్టడంతో తీవ్రంగా మనోవేదనకు గురైన ఆ విద్యార్థి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు అడ్డుకోగా అసలు విషయం బయటపడింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. విద్యార్థినిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విచక్షణ మరిచి, ప్రవర్తించిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన కాశియ్య.. తన కుమారుడు వినయ్‌ను గుంటూరు పెదపలకలూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు. ఈ క్రమంలో వినయ్‌ ను అదే కళాశాలలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అధ్యాపకుడు.. విచక్షణారహితంగా కొట్టాడు. తన స్నేహితులతో కలిసి కళాశాల ఆవరణలో అల్లరి చేస్తున్నాడనే కారణంతో చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన వినయ్‌ సత్తెనపల్లిలోని తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. ఈ ఘటనపై మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. కాగా విద్యార్థిని అడ్డుకుని చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అల్లరి చేస్తున్నాడనే నెపంతో తమ కుమారుడిని చితకబాదిన అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు విద్యార్థి తండ్రి తెలిపారు.

Also Read

Barefoot: చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. అయితే మంచిదే.. ఎందుకంటే..

UP Assembly Elections: బీఎస్పీని తక్కువ అంచనా వేయవద్దన్న అమిత్ షా.. ఎందుకన్నరో తెలుసా..?

Telangana BJP: పార్టీ అధ్యక్షుడి సొంత జిల్లాలో సీక్రెట్‌ మీటింగ్స్‌ కలకలం.. తగ్గేదే లే అంటున్న బండి సంజయ్..