ఆ నియోజకవర్గానికి TDP అభ్యర్థి ఆయనే.. కన్ఫామ్ చేసేసిన చంద్రబాబు నాయుడు..
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు.. ఏపీలో పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఈ మేరకు నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు.
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు.. ఏపీలో పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఈ మేరకు నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. తాజాగా.. పులివెందుల నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసింది. ఈ క్రమంలో చంద్రబాబు పార్టీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లాలోని పులివెందుల శాసనసభ స్థానానికి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం (TDP) అభ్యర్థిగా మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) ని ఖరారు చేశారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు పులివెందుల నియోజకవర్గ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి (MLC B.Tech Ravi) పై నాయకులకు క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోందని కొందరు నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీని వదిలి వెళ్లినవారు తిరిగి వచ్చినా.. వచ్చే ఎన్నికల్లో బీటెక్ రవి మాత్రమే పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టంచేశారు. ఆ దిశగా నాయకులంతా పార్టీ శ్రేణులతో కలిసి ముందుకు సాగాలని, స్థానికంగా టీడీపీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు.
Also Read: