Barefoot: చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. అయితే మంచిదే.. ఎందుకంటే..

చెప్పులు లేకుండా నడిస్తే ఏంటి చెప్పులు లేకుండా నడుస్తున్నాడేంటి అంటారు...

Barefoot: చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. అయితే మంచిదే.. ఎందుకంటే..
Walk
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 23, 2022 | 8:02 AM

చెప్పులు లేకుండా నడిస్తే ఏంటి చెప్పులు లేకుండా నడుస్తున్నాడేంటి అంటారు. కొంతమంది ఇంట్లో నుంచి బయటకు రావాలంటే కచ్చితంగా చెప్పులను వేసుకునే బయట అడుగుపెడతారు. కాళ్లకు దుమ్ము దూలి అంటకుండా, రాళ్లు ఒత్తుకపోకుండా వేసుకుంటారు. కానీ చెప్పులు లేకుండా నడిసే అనే ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పూర్వకాలంలో చాలా మటుకు ఇలాగే నడిచే వారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం కల్పించడానికి ఈ నడక ఎంతో సహాయపడతుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. దీంతో తొందరగా నిద్రపడుతుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవాలనుకునే వారు చెప్పులు లేకుండా నడవాలని చెబుతున్నారు.

కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కంటి చూపు మెరుగ్గా ఉండేందుకు కూడా ఈ నడక బాగా ఉపయోగపడుతుందట. చెప్పులు లేకుండా నడిస్తే రక్త ప్రసరణ సాఫీగా జరగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి నిత్యం వట్టి కాళ్లతో నడవడం అలవాటు చేసుకోవడం మంచింది. చెప్పులు లేకుండా నవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే ప్రతి చోట చెప్పులు లేకుండా నడిస్తే ఇబ్బంది ఎదురవుతుంది. చదునైన నెలపై మాత్రమే చెప్పులు లేకుండా నడవాలి.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Hair Loss: మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా.. అయితే ఈ పని చేయండి.. జుట్టు అసలే ఊడిపోదు..