Skipping Breakfast: ఉదయం అల్పాహారం తీసుకోవడం లేదా.. అయితే మీకు ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంది..
చాలా మంది ఉదయం ఆహారం తీసుకోవడం తప్పిస్తారు. కానీ ఇది మంచిది కాదు...

చాలా మంది ఉదయం ఆహారం తీసుకోవడం తప్పిస్తారు. కానీ ఇది మంచిది కాదు. ఉదయాన్నే అల్పాహారం(Breakfast) తీసుకోవడం ముఖ్యం. కొంత మంది పని బిజీలో పడి మానేస్తే మరికొందరు తర్వాత తిందాములే అని అనుకుంటారు. అయితే ఈ అల్పాహారం తీసుకోకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం తీసకోకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో చూద్దాం. అల్పాహారం మానేయడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చని చాలా మంది నమ్ముతారు. కానీ అది మీకు తీరని నష్టం చేస్తుంది. అల్పాహారం మానేయడం మంచిది కాదు. ఓట్స్(Oats), రాగి మొదలైన అల్పాహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తేలికపాటి అల్పాహారం(Light Food) రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.
దయాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్‌ని సరైన సమయంలో తీసుకోవాలి. అల్పాహారం తినకపోవడం వల్ల క్యాన్సర్ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. యువత బ్రేక్ ఫాస్ట్ తినకపోతే ఏకాగ్రత బాగా తగ్గిపోతుందట. అదేవిధంగా అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోతుంది. బట్టతల కూడా వస్తుంది.
బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల బరువు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. అయితే చాలా మంది సన్నగా అవ్వాలంటే బ్రేక్ ఫాస్ట్ మానేస్తారు కానీ బ్రేక్ ఫాస్ట్ తినకపోతే లావు అవుతారు. అలాగే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానరు కానీ ఆలస్యంగా తీసుకుంటారు. ఆలస్యంగా టిఫిన్ తిన్నా కూడా ఇబ్బందులు వస్తాయి. ఆలస్యంగా బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పని చేయండి చాలు..