Hyderabad: పక్కింటి వ్యక్తితో గుట్టు చప్పుడు యవ్వారం.. ప్రియుడితో స్కెచ్‌వేసి మరీ భర్తను..
నాచారం పీఎస్ పరిధిలో వివాహేతర సంబంధం కారణంగా భర్త నారాయణ బెహరా హత్యకు గురయ్యారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య బంధిత, ప్రియుడు విద్యాసాగర్ ప్లాన్ ప్రకారం నారాయణను హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది, వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న ఘాతుకాలకు మరో ఉదాహరణగా నిలిచింది.

వివాహేతర సంబంధం కారణంగా భాగస్వాముకే కట్టుకున్న వారిని మట్టుపెడుతున్న సంఘటనలు ఇటీవలే ఎన్నో వెలుగు చూస్తున్నాయి. వివాహ బంధంలో ఉన్నాక కూడా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకొని కట్టుకున్న వారిని కడతేర్చుతున్నారు భాగస్వాములు. తాజాగా ఇలాంటి ఘటనే నాచారం పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగాతో ఒక భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన నారాయణ బెహరా తన భార్య, కూతురితో కలిసి ఓల్ట్‌మీర్‌పేట్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. నారాయణ ప్లంబర్ పనిచేస్తుండగా.. అతని భార్య స్థానికంగా ఉన్న ఎన్‌ఏఫ్‌సీ కంపెనీలో స్వీపర్‌గా పనిచేస్తుంది. అయితే వీరు ఉంటున్న ఇంటి పక్కనే బిహార్‌కు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను వెల్డర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి పక్కనే కావడంతో నారాయణ కుటుంబంతో విద్యాసాగర్‌కు పరిచయం ఏర్పడింది.. ఈ క్రమంలోనే నారాయణ భార్య బంధిత, విద్యాసాగర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
అయితే నారయణ ఉన్నంత వరకు తాము ఏకాంతంగా కలవలేమని నిర్ణయించుకున్న బంధిత, విద్యాసాగర్ నారాయణ బెహరాను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. పతకం ప్రకారం గురువారం రాత్రి నారాయణకు మద్యం తాపాడు విద్యాసాగర్.. అయితే ఇంటికెళ్లాక భార్య మంధిత నారయణతో గొడవ పెట్టుకుంది.. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన విద్యాసాగర్‌తో కలిసి భర్తను ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశారు ఇద్దరూ. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై అనుమానాస్పత మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
