మాజీ ఎంపీ కవిత పెద్దమనసు

చిన్నారుల చదువులకు సాయం చేయాలంటూ ఓ స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన విజ్ణప్తికి తక్షణమే స్పందించారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన 77 ఏళ్ల బైలా గాబ్రియల్ సెయింట్ జోసెఫ్ పేరుతో పాఠశాలను నిర్వహిస్తున్నారు.

మాజీ ఎంపీ కవిత పెద్దమనసు
Follow us

|

Updated on: Sep 04, 2020 | 7:21 PM

చిన్నారుల చదువులకు సాయం చేయాలంటూ ఓ స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన విజ్ణప్తికి తక్షణమే స్పందించారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన 77 ఏళ్ల బైలా గాబ్రియల్ సెయింట్ జోసెఫ్ పేరుతో పాఠశాలను నిర్వహిస్తున్నారు. 1993 లో ప్రారంభమైన ఈ పాఠశాలలో అణగారిన వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ.. 27 ఏండ్లుగా వేలాది మంది నిరుపేదలను విద్యావంతులుగా తీర్చిదిద్దింది. .అయితే కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలల్లో విద్యను బోధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆన్ లైన్ క్లాసులు ‌నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్ ల కొరత ఏర్పడింది. దీంతో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరుతూ మేరికా ఇసాబెల్ ట్వీట్ చేశారు. ట్వీట్ పై స్పందించిన కవిత పిల్లల చదువులకు చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు గాను తొమ్మిది కంప్యూటర్ లను‌ అందించాలని‌ నిర్ణయించారు. కవిత సూచన మేరకు తెలంగాణ జాగృతి ప్రతినిధులు పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్ లను అందించారు. ‌మానవత్వంతో‌ స్పందించి కంప్యూటర్ లను అందించిన మాజీ ఎంపీ కవితకు మేరికా‌ ఇసాబెల్, బైలా గాబ్రియల్, ఉపాధ్యాయులు ‌కృతజ్ఞతలు తెలిపారు.