Vemulawada MLA : ఎమ్మెల్యే మిస్సింగ్‌.. కొన్నాళ్లుగా సెర్చింగ్‌, సీఎం సార్‌… వేరీజ్‌ అవర్‌ ఎమ్మెల్యే అంటూ చెన్నమనేని కోసం ఏకంగా జేఏసీ ఫైట్

Chennamaneni Ramesh : ఎమ్మెల్యే మిస్సింగ్‌. కొన్నాళ్లుగా సెర్చింగ్‌. అసెంబ్లీకొస్తారనే ఆశలేదు. అందుకే మాకొద్దీ ఎమ్మెల్యే అంటూ ఏకంగా ఓ జేఏసీనే..

Vemulawada MLA :  ఎమ్మెల్యే మిస్సింగ్‌.. కొన్నాళ్లుగా సెర్చింగ్‌, సీఎం సార్‌... వేరీజ్‌ అవర్‌ ఎమ్మెల్యే అంటూ చెన్నమనేని కోసం ఏకంగా జేఏసీ ఫైట్
Chennamaneni
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 15, 2021 | 10:22 PM

Chennamaneni Ramesh : ఎమ్మెల్యే మిస్సింగ్‌. కొన్నాళ్లుగా సెర్చింగ్‌. అసెంబ్లీకొస్తారనే ఆశలేదు. అందుకే మాకొద్దీ ఎమ్మెల్యే అంటూ ఏకంగా ఓ జేఏసీనే ఏర్పడింది. ఆందోళనకు దిగింది. ఇంతమంది ఎమ్మెల్యేల్లో..ఆయనే ఎందుకంత స్పెషల్‌? అసలాయన ఏమయ్యారు? ఎప్పుడొస్తారు?, అంతేనా, జనమంతా వెయిటింగ్‌ సార్‌…ఎక్కడున్నారు మీరు? అంటూ అరుపులు, నినాదాలు. ఇదీ వరస…

పౌరసత్వ వివాదంలో చిక్కుకున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ మరోసారి అందరి నోళ్లలో నానుతున్నారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఎమ్మెల్యేగారేమో జర్మనీలో ఉన్నారు. దీంతో అందుబాటులో ఉండని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనకు దిగింది. చెన్నమనేనికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఏకంగా ఓ జేఏసీనే ఏర్పడింది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ రాజీనామా చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వేములవాడ బీజేపీ నేతలు ప్రయత్నించారు. సీఎం సార్‌…వేరీజ్‌ అవర్‌ ఎమ్మెల్యే అంటూ ప్లకార్డులు చూపిస్తూ నిరసనకు దిగిన బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పౌరసత్వంపై వివాదం నడుస్తుండగానే రెండోసారి కూడా వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చెన్నమనేని రమేష్. ఆయన పౌరసత్వంపై నెలక్రితం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేనికి జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే చెన్నమనేని పౌరసత్వంతో కేంద్రానికి సంబంధంలేదని తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదించారు. ప్రస్తుతం ఆయన భారత్‌లోనే ఉన్నారని, ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారని కోర్టుకు విన్నవించారు. పూర్తివివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కోరారు.

జర్మనీ పౌరసత్వంతో పదేళ్లు తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని పిటిషనర్‌ ఆదిశ్రీనివాస్ తరపు న్యాయవాది కోర్టుని కోరారు. రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. చెన్నమనేనిరమేష్‌ భారత పౌరుడు కాదని 2017లోనే కేంద్ర హోంశాఖ స్పష్టంచేసింది. రమేష్‌ అభ్యర్థనని సమీక్షించి ఆయనకు భారత పౌరసత్వం లేదని రెండోసారి కూడా తేల్చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలను సవాలు చేస్తూ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు.

ఇరుపక్షాల కౌంటర్లతో తెలంగాణ హైకోర్టులో పౌరసత్వ వివాదంపై విచారణ కొనసాగుతున్న సమయంలో.. వేములవాడ జేఏసీ పేరుతో నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. మా సారు కనిపించడం లేదంటూ నాలుగురోజులు పోతే పోస్టర్లేసేలా ఉన్నారు. పోలీసులకు కంప్లయింట్‌ చేసేలా ఉన్నారు.

Read also :

Daylight saving time In U S : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పగటి సమయం ఆదా కోసం టైం చేంజ్, ఇదే పర్మినెంట్ చేయాలంటోన్న అగ్రరాజ్య ప్రజలు

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!