Telangana: మధ్యతరగతి ప్రజలు ఇక సేఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు.!

హమ్మయ్య.. మధ్యతరగతి ప్రజలు సేఫ్‌. 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడితే ఫిక్సుడ్ ఛార్జీల మోత మోగించాలన్న డిస్కంలకు ERC షాక్‌ ఇచ్చింది. స్థిర ఛార్జీలు 10 రూపాయల నుంచి 50 రూపాయలు పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది.

Telangana: మధ్యతరగతి ప్రజలు ఇక సేఫ్.. విద్యుత్ ఛార్జీల పెంపు లేదు.!
Telangana Electricity Price
Follow us

|

Updated on: Oct 29, 2024 | 7:02 AM

తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీల పెంపునకు బ్రేక్ పడింది. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ జరిపిన ఈఆర్సీ వాటిని తిరస్కరించింది. సామాన్య, మధ్యతరగతిప్రజలకు ఊరట కల్పించింది. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదని స్పష్టం చేసింది. స్థిర చార్జీలు 10 రూపాయలు యధాతధంగా ఉంటాయని ప్రకటించింది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లను కమిషన్ ఆమోదించలేదు. హెచ్‌టీ కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేసింది. 1800కోట్ల విద్యుత్ చార్జీల పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించిన వారిపై ఫిక్సుడ్‌ ఛార్జీలను 50 రూపాయలకు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. 10 రూపాయల స్థిర ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయని ERC ఛైర్మన్‌ శ్రీరంగారావు తెలిపారు. విద్యుత్ వినియోగం 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ ఆమోదించింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

మరికొన్ని కేటగిరిల్లో 0.47శాతం టారిఫ్ రేట్లు పెరిగాయి. గృహ వినియోగదారులకు మినిమమ్‌ చార్జీలు తొలగించింది ఈఆర్సీ. గ్రిడ్ సపోర్ట్ చార్జీలను కమిషన్ ఆమోదించింది. 132కేవీఏ, 133కేవీఏ, 11కేవీలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. టైమ్ ఆఫ్ డేలో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు లేదు. చేనేత కార్మికులకు హార్స్ పవర్‌ను పెంచింది. హెచ్‌పీ 10 నుంచి హెచ్‌పీ 25కి పెంచింది. విద్యుత్ ఛార్జీల మోత తాత్కాలికంగా ఆగిందంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఈ ప్రతిపాదనలు ఈ ఆర్థిక సంవత్సరంలోని ఐదు నెలల వరకే ఉంటాయని చెబుతున్నారు.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..