TG High Court Jobs: తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే

తెలంగాణ హైకోర్టు ఖాళీగా ఉన్న లా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

TG High Court Jobs: తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే
TG High Court
Follow us

|

Updated on: Oct 29, 2024 | 6:48 AM

తెలంగాణ రాష్ట్రంలోని హైకోర్టు ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఉన్న తెలంగాణ హైకోర్టు ఖాళీగా ఉన్న లా క్లర్క్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 33 లా క్లర్క్‌ ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు, తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీ, సికింద్రాబాద్‌లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 23, 2024వ తేదీలోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు జులై 1, 2024వ తేదీ 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల చొప్పున సడలింపు ఉంటుంది. అభ్యర్ధులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ‘లా’ కోర్సులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్‌ తర్వాత రెగ్యులర్ విధానంలో ఐదేళ్ల లా కోర్సు లేదా గుర్తింపు పొందిన యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న కళాశాల నుంచి 3 సంవత్సరాల రెగ్యులర్ లా డిగ్రీతోపాటు దానికి ముందు రెగ్యులర్ విధానంలో 10+2 సంవత్సరాల పాఠశాల విద్యను చదివి ఉండాలి. లేదా నోటిఫికేషన్‌ నాటికి లా డిగ్రీలో రెండేళ్లు చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు కంప్యూటర్‌ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఎవరైనా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి నవంబర్‌ 23, 2024వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తును నింపి, సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. లా క్లర్క్‌ పోస్టులకు ఎంపికైన వారు ఉద్యోగ సమయంలో ఏదైనా కోర్సును చదవడం గానీ, మరేదైనా జీతం వచ్చే ఉద్యోగం గానీ చేయకూడదు.

ఇవి కూడా చదవండి

చిరునామా

ది రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్’ చిరునామాకు పంపించాలి

(The Registrar General, High Court for the State of Telangana)

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.