Nizamabad: అపచారం.. ఓవైపు దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుంటే.. ఇదేం పని మిస్టర్ ఈవో

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంటేశ్వరాలయంలో అపచారం జరిగింది. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా అక్కడే ఈవో వేణు జలకాలాటలు ఆడాడు. పుష్కరిణిలో ఈత కొట్టద్దని అర్చకులు వారించినా వినలేదు.

Nizamabad: అపచారం.. ఓవైపు దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుంటే.. ఇదేం పని మిస్టర్ ఈవో
Neelakantheswara Temple
Follow us
Ram Naramaneni

|

Updated on: May 26, 2023 | 3:15 PM

నిజమాబాద్ జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నీలకంటేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈవో వేణు సరస్సులో జలకాలాడారు. పుష్కరిణిలో ఈత కొట్టొద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా… ఈవో వినిపించుకోకుండా ఈత కొట్టడం సంచలనంగా మారింది. అభిషేకం జరుగుతున్నా పట్టించుకోకుండా దర్జాగా ఈత కొట్టడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఈత కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈవో వేణుపై విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు ఆలయాలకు ఇంచార్జీ ఈఓగా పని చేస్తున్న వేణు తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ కాశీగా నీలకంటేశ్వర ఆలయం ప్రసిద్ధి. అలాంటి పుష్కరణిలో, అది కూడా దేవుని విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తుండగా ఇలా చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే వారిని శిక్షించాల్సింది పోయి… ఆలయ ఈఓగా ఉన్న వేణు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించడం ఏంటని నిలదీస్తున్నారు. ఈఓ స్థానంలో పనిచేస్తున్న వేణును తక్షణమే సస్పెండ్‌ చేయాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈవో వేణు భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు భక్తులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..