తెలంగాణ, మహారాష్ట్రలలో భూ ప్రకంపనలు

ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పలుచోట్ల భూమి కంపించింది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పార్డి, దేవులనాయక్‌ తండా, భీంపూర్‌ మండలం వడూరులో భూమి కంపించింది. 2 నుంచి 5 సెకన్లపాటు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  నిర్మల్‌ జిల్లా కుభీరు మండలంలోనూ  రాత్రి 9.25 సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డోడర్న పరిధిలోని నాలుగు తండాలతో పాటు పాంగ్ర, బాకోట్‌ గ్రామాలు… భైంసా, మిర్జాపూర్‌, పాంగ్రిలో […]

తెలంగాణ, మహారాష్ట్రలలో భూ ప్రకంపనలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 22, 2019 | 7:19 AM

ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పలుచోట్ల భూమి కంపించింది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పార్డి, దేవులనాయక్‌ తండా, భీంపూర్‌ మండలం వడూరులో భూమి కంపించింది. 2 నుంచి 5 సెకన్లపాటు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  నిర్మల్‌ జిల్లా కుభీరు మండలంలోనూ  రాత్రి 9.25 సమయంలో భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. డోడర్న పరిధిలోని నాలుగు తండాలతో పాటు పాంగ్ర, బాకోట్‌ గ్రామాలు… భైంసా, మిర్జాపూర్‌, పాంగ్రిలో భూప్రకంపనలు సంభవించాయి.

మరోవైపు మహారాష్ట్రలోనూ భూమి స్వల్పంగా కంపించింది. సాతారా జిల్లాలోని కొన్నిచోట్ల ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.8గా నమోదైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంపం ధాటికి ఇళ్లలోని వస్తువులు, సామానులు చెల్లాచెదురుగా పడిపోయాయి.