మెట్రో జర్నీ సూపర్ గురూ!
హైదరాబాదులో ట్రాఫిక్ కష్టాల కొత్తగా చెప్పేది ఏముంటుంది. అది కూడా ప్రైమ్ టైమ్ అయితే ట్రాఫిక్‌ను తప్పించుకోవడం ఆ బ్రహ్మదేవుడి తరం కూాడా కాదు. పైగా ఇప్పుడు వర్షాలు కూడా మొదలయ్యాయి. దాంతో ట్రాఫిక్ మరింత పెరిగిపోయింది. మెట్రో వచ్చాక కొంతంలో కొంత బెటర్ లేండి. అయితే ఈ రోజు వర్షం పడటంతో హైదరాబాద్‌లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో షూటింగ్ ముగించుకొస్తున్న హీరో నితిన్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు. ఇక ఇలా అయితే ఇంటికి […]
హైదరాబాదులో ట్రాఫిక్ కష్టాల కొత్తగా చెప్పేది ఏముంటుంది. అది కూడా ప్రైమ్ టైమ్ అయితే ట్రాఫిక్‌ను తప్పించుకోవడం ఆ బ్రహ్మదేవుడి తరం కూాడా కాదు. పైగా ఇప్పుడు వర్షాలు కూడా మొదలయ్యాయి. దాంతో ట్రాఫిక్ మరింత పెరిగిపోయింది. మెట్రో వచ్చాక కొంతంలో కొంత బెటర్ లేండి.
అయితే ఈ రోజు వర్షం పడటంతో హైదరాబాద్‌లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో షూటింగ్ ముగించుకొస్తున్న హీరో నితిన్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడు. ఇక ఇలా అయితే ఇంటికి వెళ్లడం కష్టమనుకున్నాడో ఏమో? కార్ దిగేసి వెంటనే మెట్రో ట్రైన్ ఎక్కేశాడు. తొలిసారి మెట్రో ట్రెయిన్ ప్రయాణించిన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు నితిన్.
మెట్రో జర్నీ చాలా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోడానికి మెట్రో మంచి ఆప్షన్ అని చెప్పుకొచ్చాడు. ఈయన ఒక్కడే కాదు.. చాలా మంది కూడా ఇప్పుడు ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పుకోడానికి మెట్రో ఎక్కేసి వెళ్లిపోతున్నారు. నితిన్ ట్రెయిన్‌లో ప్రత్యక్షం కావడంతో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రమాణికులు ఎగబడ్డారు.
Heavy traffic on roads!!so post pack up i took the metro to beat the traffic!! LOVED the experience?? @HydMetroRail pic.twitter.com/bnyItoBkjq
— nithiin (@actor_nithiin) June 21, 2019