తను కురచ దుస్తులు వేసిందా? పసికందు దారుణంపై రష్మి ఆవేదన
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 9 నెలల పసికందు హత్యాచారం, హత్య ఘటనపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ దారుణంపై నటి, యాంకర్ రష్మి ఘాటుగా స్పందించారు. ‘9 నెలల పసికందుపై జరిగిన దారుణం చూసి నా మనసు చలించి పోయింది. ఆమె ఏం తప్పు చేసింది? పొట్టి దుస్తులు ధరించిందా? క్లీవేజ్ ప్రదర్శించిందా? కాళ్లు చూపించిందా? తన ఒపీనియన్ వెల్లడించిందా? ఏం తప్పు చేసింది?’ అంటూ….. రష్మి ఫైర్ అయ్యారు. మహిళల వస్త్రధారణ సరిగా […]
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 9 నెలల పసికందు హత్యాచారం, హత్య ఘటనపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ దారుణంపై నటి, యాంకర్ రష్మి ఘాటుగా స్పందించారు.
‘9 నెలల పసికందుపై జరిగిన దారుణం చూసి నా మనసు చలించి పోయింది. ఆమె ఏం తప్పు చేసింది? పొట్టి దుస్తులు ధరించిందా? క్లీవేజ్ ప్రదర్శించిందా? కాళ్లు చూపించిందా? తన ఒపీనియన్ వెల్లడించిందా? ఏం తప్పు చేసింది?’ అంటూ….. రష్మి ఫైర్ అయ్యారు. మహిళల వస్త్రధారణ సరిగా లేక పోవడం వల్లే అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి అనే విమర్శిస్తున్న వారిని ఉద్దేశించి రష్మి ఈ ట్వీట్ చేశారు.
Now what did the 9 month old baby do to deserve this fate Did she wear the wrong clothes Did she show cleavage Did she show legs Did she voice her opinion Did she what ?????
— rashmi gautam (@rashmigautam27) June 20, 2019
మరో ట్వీట్లో రష్మి రియాక్ట్ అవుతూ ప్రధాని నరేంద్రమోదీని ట్యాగ్ చేశారు. ‘బేటీ బచావో బేటీ పడావో అన్నారు ఎక్కడ సార్? ఇక్కడ బేటీకి రక్షణ కూడా లేకుండా పోయింది’ అంటూ వ్యాఖ్యానించారు. రష్మి చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. ఆమెకు మద్దతుగా రిట్వీట్లు చేస్తున్నారు.
@narendramodi Sir #betibachaobetipadhao kaha se hoga jab beti bachegie nahi pic.twitter.com/ktzMTV6lXM
— rashmi gautam (@rashmigautam27) June 20, 2019