Bjp Vs Trs: మరో బాంబ్ పేల్చిన ఎమ్మెల్యే రఘునందన్.. ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అంటూ..
Bjp vs Trs: బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. అతి కొద్ది రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి లేదా రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని
Bjp vs Trs: బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. అతి కొద్ది రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకటి లేదా రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయంగా ఎదగకుండా తన సొంత పోరాట పటిమతో తాను నమ్మిన హిందూ ధర్మంతో మరాఠా సామ్రాజ్యన్ని పాలించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆలోచన విధానంలో తేడా వచ్చిందని, దానికి నిదర్శనమే హుజురాబాద్ ఎన్నికల ఫలితం అని పేర్కొన్నారు.
యాసంగి వడ్ల విషయంలో ఏడు సంవత్సరాల నుంచి కొంటున్న కేంద్రాన్ని ఏ ఒక్క దగ్గర గుర్తు చేసుకొకపోగా.. రాష్ట్రం ప్రభుత్వమే ధాన్యం కొన్నదని కేసీఆర్ సర్కార్ చెప్పిందన్నారు. ఈ ఒక్క సంవత్సరం కేంద్రం కొనలేము అని చెబితే.. తప్పంతా కేంద్రానిదే అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా జైలుకు వెళ్లాల్సిందేనని ఎమ్మెల్యే రఘునందన్ ఉద్ఘాటించారు. కాగా, ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘు నందన్ రావుతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Also read: