Eye of the Doctor: రోజు రోజుకీ పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వాడకం.. పిల్లలో పెరుగుతున్న కంటిచూపు సమస్యలు..
Eye of the Doctor: స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లలలో వీటి వాడకం ఎక్కువైంది అంటే.. ఇక కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ క్లాసులు సర్వసాధారణంగా..
Eye of the Doctor: స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లలలో వీటి వాడకం ఎక్కువైంది అంటే.. ఇక కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ క్లాసులు సర్వసాధారణంగా మారాయి. దీంతో పిల్లల్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడకం అధికమైంది. దీంతో పిల్లల్లో కంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రముఖ కంటి వైద్యులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత .. సీఎం కేసీఆర్ వ్యక్తిగత కంటి వైద్యులు డా. మహిపాల్ ఎస్. సచ్‌దేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మయోపియా (హ్రస్వదృష్టి) బారిన పడుతున్న పిల్లల సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ మేరకు చైనా, కొరియా, తైవాన్ దేశాల్లో నిర్వహించిన పలు అధ్యయనంలో షాకింగ్ గణాంకాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఆ దేశాల్లో పిల్లల్లో 65 శాతం వరకు కంటిచూపు సమస్య ఎదుర్కొంటున్నారని ఓ సర్వేలో బయపడిందన్నారు.
అయితే స్టూడెంట్స్ లో దృష్టిలోపం ఏర్పడితే.. పిల్లలు చదువులో, క్రీడల్లో వెనుకబడిపోతారు. ఇక మన దేశ జనాభాలో 35 శాతం ప్రజలకు కంటిచూపు సమస్య ఉందని పలు లెక్కల ద్వారా తెలుస్తోంది. అయితే చాలామంది తమకు కళ్లద్దాలు అవసరమని గ్రహించడం లేదు. అందుకనే కళ్లద్దాలు అవసరమైనవారు నలుగురు ఉంటె.. వారిలో ఒకరు మాత్రమే కళ్లద్దాలు ధరిస్తున్నారు. అయితే కంటి సమస్యలు బయటపడాలంటే కంటిపరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే కంటి సమస్యలు బయటపడతాయి.
తెలంగాణ ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పేరుతో అమలుచేస్తున్న పథకం అభినందనీయమని సచ్‌దేవ్ తెలిపారు. అంతేకాదు తమ సంస్థ ద్వారా కంటిపరీక్షలను ఇంటి ముంగిటకే అందుబాటులోకి తెస్తున్నామని.. విజన్ ఆన్ వీల్స్ పేరుతో రూ. 199కే ఇంటికొచ్చి కంటిపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు ఇప్పటికే హైదరాబాద్‌లో మూడు సెంటర్లను, విజయవాడలో ఒక సెంటర్ ప్రారంభించామని చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో తమ సంస్థను దక్షిణాదిన మరింతగా విస్తరిస్తామని .. కంటి వైద్యం విషయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నెలకొల్పుతామని అన్నారు డా. మహిపాల్ ఎస్. సచ్‌దేవ్
Also Read: ISIS ఆన్‌లైన్ మ్యాగజైన్ పోస్టర్ వివాదం.. భద్రతా పెంచిన కన్నడ ప్రభుత్వం