Telangana: మటన్‌, చికెన్‌కు అలవాటు పడిన కుక్కలు.. మాంసం దొరక్కపోవడం అర్థరాత్రి వేళ..!

Telangana: మటన్, చికెన్‌కు అలవాటు పడిన కుక్కలు.. ఒక్కరోజు మాంసం దొరక్కపోవడంతో దారుణానికి ఒడిగట్టాయి. గొర్రెల మందపై పడి..

Telangana: మటన్‌, చికెన్‌కు అలవాటు పడిన కుక్కలు.. మాంసం దొరక్కపోవడం అర్థరాత్రి వేళ..!
Dogs
Follow us

|

Updated on: Jun 28, 2022 | 12:26 PM

Telangana: మటన్, చికెన్‌కు అలవాటు పడిన కుక్కలు.. ఒక్కరోజు మాంసం దొరక్కపోవడంతో దారుణానికి ఒడిగట్టాయి. గొర్రెల మందపై పడి 15 గొర్రెలను చంపేశాయి. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కొత్తూరు మండలం ఇన్వుల్ నర్వ గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. అవును, మీరు విన్నది నిజంగా నిజం. ఇన్వుల్ నర్వ గ్రామ పరిధిలోని రైతు నవీన్ తన వ్యవసాయ పొలంలో కొట్టం ఏర్పాటు చేశాడు. ఆ కొట్టంలో రాత్రి గొర్రెలను ఉంచేవాడు. అయితే, నిన్న రాత్రి గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. 15 గొర్రెలను కొరికి చంపేశాయి. దీనివల్ల బాధిత రైతుకు సుమారు రూ. 1.50 లక్షలు నష్టం జరిగింది. అయితే, కుక్కల దాడికి పక్కన ఉన్న వెంచర్లే కారణం అని ఆరోపిస్తున్నాడు బాధిత రైతు. వ్యవసాయ క్షేత్రం సమీపంలో వెంచర్లు ఉండటంతో.. మందుబాబులు ఆ వెంచర్లను అడ్డాగా చేసుకుని మద్యం సేవించడం, మటన్, చికెన్ వంటి పదార్థాలు అక్కడ పడియేంతో కుక్కలు వాటికి అలవాటు పడ్డాయన్నాడు. మటన్, చికెన్‌కు అలవాటు పడిన కుక్కలు.. తాజాగా మాంసం దొర్కపోవడంతో గొర్రెల మందపై పడి దాడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు రైతు నవీన్. మందుబాబు బాబులను కట్టడి చేయాలని స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.