Telangana: మరోసారి హైకోర్టు ముందుకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కేడర్‌పై తలెత్తిన వివాదం..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jan 27, 2023 | 12:02 PM

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ సహా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది రెగ్యులర్‌ బెంచ్‌. మొత్తం పిటిషన్లను కలిపి..

Telangana: మరోసారి హైకోర్టు ముందుకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కేడర్‌పై తలెత్తిన వివాదం..
TS IAS and IPS Cadre Cases

ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కేడర్‌పై తలెత్తిన వివాదం మరోసారి హైకోర్టు ముందుకొచ్చింది. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ సహా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది రెగ్యులర్‌ బెంచ్‌. మొత్తం పిటిషన్లను కలిపి విచారించబోతోంది. 2017లో క్యాట్‌ ఆదేశాలను సవాలుచేస్తూ హైకోర్టును ఆశ్రయించింది డీవోపీటీ. ఐదారేళ్ల విచారణ తర్వాత సోమేష్‌కుమార్‌ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది హైకోర్టు. అప్పటివరకు తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేష్‌ను తక్షణమే ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది.

అయితే, తమ పిటిషన్లను సోమేష్‌ కేసుతో లింక్‌ పెట్టొద్దంటున్నారు మిగతా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు. ప్రతి కేసులోనూ క్యాట్‌ వేర్వేరు తీర్పులు ఇచ్చిందని హైకోర్టుకు విన్నవించుకున్నారు. వేర్వేరు వివాదాలు, వేర్వేరు తీర్పులు ఉన్నందున ప్రతి పిటిషన్‌ను సెపరేట్‌గా విచారించాలంటున్నారు ఐఏఎస్‌, ఐపీఎస్‌లు.

రాష్ట్ర విభజన అనంతరం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కేడర్‌పై వివాదం తలెత్తింది. ఏపీకి కేటాయించినా క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే కొనసాగుతున్నారు కొందరు అధికారులు. రీసెంట్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ సోమేష్‌కుమార్‌ను ఏపీలో రిపోర్ట్‌ చేయాలంటూ హైకోర్టు ఆదేశించడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. డీజీపీ అంజనీకుమార్‌ సహా దాదాపు 14మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు… హైకోర్టును ఆశ్రయించడంతో ఏం జరగబోతోందనన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu