Gussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజుకు పెన్షన్ అందిస్తున్నాం.. అవన్నీ తప్పుడు వార్తలే.. తేల్చి చెప్పిన సాంస్కృతిక శాఖ

ఆదివాసీ కళాకారుడు గుస్సాడీ కనకరాజుకు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నట్లుగా సాంస్కృతిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి నెలకు...

Gussadi Kanakaraju: గుస్సాడీ కనకరాజుకు పెన్షన్ అందిస్తున్నాం.. అవన్నీ తప్పుడు వార్తలే.. తేల్చి చెప్పిన సాంస్కృతిక శాఖ
Gussadi Kanakaraju
Follow us

|

Updated on: Sep 21, 2021 | 4:26 PM

Gussadi Kanakaraju: ఆదివాసీ కళాకారుడు గుస్సాడీ కనకరాజుకు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నట్లుగా సాంస్కృతిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి నెలకు పది వేల రూపాయల చొప్పున ప్రత్యేక పింఛన్లను విడుదల చేసినట్టు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వివరణ ఇచ్చారు. గుస్సాడీ కనకరాజకు ఇచ్చిన చెక్కు వివరాలను నెంబర్లతో సహా ప్రకటించారు. జూన్ మాసానికి గాను చెక్ నెంబర్ 10328469 ద్వారా జూలై 24 న, జూలై మాసానికి గాను చెక్ నెంబర్ 11740033 ద్వారా ఆగస్టు10 న, ఆగస్టు మాసానికి గాను చెక్ నెంబర్ 15972986, సెప్టెంబర్ 9 న విడుదల చేశామని తెలిపారు. పింఛను చెల్లింపులో ఏవిధమైన జాప్యం లేదని మామిడి హరికృష్ణ తాజా ప్రకటనలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కనకరాజుకు ప్రతీ నెల 10 వేల పెన్షన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 31 న మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ ఆఫీస్ లో కనకరాజుకు స్వయంగా పెన్షన్ ఆర్డర్ కాపీని కూడా ఇచ్చారు. అయితే.. నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు కనకరాజుకు రూపాయి సాయం అందలేదంటూ ప్రచారం జరగడం తప్పు అంటూ తెలిపారు. కొద్ది రోజుల క్రితం కనకరాజుకు టీబీ సోకింది. దీంతో హాస్పిటల్లో వైద్యం చేయించుకునేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో పెండింగ్‌లో ఉన్న 3 నెలల పెన్షన్ మొత్తాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కనకరాజుతో పాటు కళాకారులు 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలియ్య, భరత్ భూషణ్ లకు నెలకు 10 వేల రూపాయలు సాయం అందిస్తున్నట్లుగా చెప్పారు సాంస్కృతిక శాఖ డైరెక్టకర్ మామిడి హరికృష్ణ. ఆ ముగ్గురి కళాకారులకు ప్రత్యేకంగా జీవితాంతం నెలకు రూ 10 వేలను అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.

ఇవి కూడా చదవండి: Ktr vs Revanth: రేవంత్‌పై మంత్రి కేటీఆర్ వ్యవహారంలో మరో కీలక మలుపు.. సిటీ సివిల్ కోర్టులో రీ పిటిషన్..

Raj Kundra: రాజ్ కుంద్రా కేసులో మరో కోణం.. ఆ పోర్న్ వీడియోలు అమ్మేందుకు భారీ డీల్.!