Mallareddy: మరోసారి వార్తల్లో నిలిచిన మంత్రి మల్లారెడ్డి.. మేడ్చల్‌ మండల సర్వసభ్య సమావేశంలో హైఓల్టేజ్‌ డైలాగ్ వార్‌..

Mallareddy: ఈ మధ్య కాలంలో మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ మల్లారెడ్డి ఎపిసోడ్‌ రాష్ట్ర రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు..

Mallareddy: మరోసారి వార్తల్లో నిలిచిన మంత్రి మల్లారెడ్డి.. మేడ్చల్‌ మండల సర్వసభ్య సమావేశంలో హైఓల్టేజ్‌ డైలాగ్ వార్‌..
Mallareddy
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 21, 2022 | 8:41 AM

Mallareddy: ఈ మధ్య కాలంలో మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వర్సెస్‌ మల్లారెడ్డి ఎపిసోడ్‌ రాష్ట్ర రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా నిర్వహించిన మేడ్చల్‌ మండల సర్వసభ్య సమావేశం రసాభసాగా మారింది. మంత్రి మల్లారెడ్డి వర్సెస్‌ కాంగ్రెస్‌గా వార్‌ సాగింది. మండల సర్వసభ్య సమావేశంలో డబీల్‌పురా ఎంపీటీసీ హేమలత, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది.

ఎంపీటీసీ నిధులపై మల్లారెడ్డిని హేమలత నిలదీయడంతో సమావేశంలో గందరగోళం చెలరేగింది. గ్రామాల్లో ఎంపీటీసీకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, నిధులు కేటాయించడం లేదంటూ మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించారు కాంగ్రెస్‌ ఎంపీటీసీ హేమలత. నిధులు కేటాయించకపోవడంతో తన పరిధిలోని డబీల్‌పూర్‌, లింగపూర్‌, బర్మాజీగూడలో అభివృద్ధి చేయలేకపోతున్నానంటూ నిలదీశారు. దాంతో, మల్లారెడ్డి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ‘ఏ.. మీకు ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి కనబడటం లేదా? అనేక పథకాల ద్వారా ప్రజలకు నగదు అందించడం లేదా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు మల్లారెడ్డి.

ఎంపీటీసీలకు ఇస్తేనే నిధులా? సర్పంచ్‌లకు కేటాయిస్తున్నవి నిధులు కావా? అంటూ విరుచుకుపడ్డారు మంత్రి. అయినా, కాంగ్రెస్‌ ఎంపీటీసీ హేమలత శాంతించకపోవడంతో టీఆర్‌ఎస్‌కు చెందిన డబీల్‌పూర్‌ సర్పంచ్‌ గీతా భాగ్యరెడ్డి వాగ్వాదానికి దిగారు. దాంతో, వాళ్లిద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. ఒక ఎంపీటీసీగా తన వార్డులో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతే ఇక తానేందుకంటూ రివర్స్‌లో ప్రశ్నించారు హేమలత. దాంతో, మేడ్చల్‌ మండల సర్వసభ్య సమావేశం కాస్త… మల్లారెడ్డి వర్సెస్‌ ఎంపీటీసీ వార్‌గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..