AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ రంగంపై విరుచుకుపడింది. ఒకే పౌల్ట్రీ ఫాంలో గత రెండు మూడు రోజులుగా సుమారు 5,000 కోళ్లు మృత్యువాత పడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఈ అకస్మాత్తు మరణలతో రైతులు తీవ్ర ఆందోళన పడుతుండగా, చికెన్‌ ప్రియులు భయంతో వణికిపోతున్నారు. లక్షల కోళ్లు మరణించటంతో దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!
Bird Flu
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Mar 31, 2026 | 5:46 PM

Share

పౌల్ట్రీ రంగాన్ని ఒక అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడం ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పెద్దకొత్తపల్లికి చెందిన రైతు వెంకటస్వామి పౌల్ట్రీ ఫాంలో గత మూడు రోజులుగా కోళ్లు వింతగా ప్రవర్తిస్తూ ప్రాణాలు వదులుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 5,000 కోళ్లు మృతి చెందాయి. దీనివల్ల సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మందులు వాడినా ఫలితం ఉండటం లేదని, రోజురోజుకూ చనిపోయే కోళ్ల సంఖ్య పెరుగుతోందని ఆయన వాపోతున్నారు.

ఈ వార్త బయటకు రావడంతో స్థానికంగా ఇది బర్డ్ ఫ్లూ (Bird Flu) కావచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీంతో పెద్దకొత్తపల్లి, చుట్టుపక్కల గ్రామాల్లోని నాన్-వెజ్ ప్రియులు చికెన్ కొనాలంటేనే భయపడుతున్నారు. చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. అయితే, ఇది బర్డ్ ఫ్లూనా లేక మరేదైనా కొత్త వైరస్సా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కోళ్ల మరణాల వార్త తెలుసుకున్న పశువైద్య శాఖ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి పోస్ట్‌మార్టం నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.

వైరస్ మరింత వ్యాపించకుండా చనిపోయిన కోళ్లను లోతైన గుంతలు తీసి పూడ్చివేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ల్యాబ్ నివేదిక వస్తుందని, అప్పటి వరకు రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పెట్టుబడి పెట్టిన సొమ్ము కూడా తిరిగి రాకపోవడంతో పౌల్ట్రీ రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైరస్‌ను గుర్తించాలని, నష్టపోయిన తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా లక్షలాది కోళ్లు ఇలాగే చనిపోతున్నాయని వస్తున్న వార్తలు పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.
వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
ఈ బడ్డోడిది మాములుగా లక్కీ హ్యాండ్ కాదు బాబోయ్.. కుటుంబానికి..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!