AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 500 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే

Telangana MHSRB, MHSRB Merit List 2026: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని 500 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు జూలై 17 నుంచి 20 వరకు హైదరాబాద్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనుండగా, జూలై 21ను రిజర్వ్ డేగా ప్రకటించింది.

తెలంగాణలో 500 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్ షెడ్యూల్ ఇదే
Telangana Mhsrb, Mhsrb Merit List 2026
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jul 15, 2026 | 8:42 PM

Share

Civil Assistant Surgeon Recruitment: తెలంగాణలో వైద్య పోస్టుల భర్తీ ప్రక్రియ శరవేగంగా దూసుకుపోతోంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసే దిశగా సర్కార్ మరో కీలక అడుగు వేసింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తాజాగా, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం నాడు నాలుగు కీలక విభాగాలకు సంబంధించిన 500 పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది.

మొత్తం 500 పోస్టులకు గానూ విభాగాల వారీగా ఖాళీలు

  • జనరల్ సర్జరీ.. 174 పోస్టులు
  • జనరల్ మెడిసిన్.. 166 పోస్టులు
  • ఆర్థోపెడిక్స్.. 89 పోస్టులు
  • రేడియాలజీ.. 71 పోస్టులు

జూలై 17 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్

ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 17 నుంచి జూలై 20 వరకు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ప్రాంగణం, హైదరాబాద్‌లో జరగనుంది. ఏదైనా అనివార్య కారణాల వల్ల నిర్ణీత తేదీల్లో హాజరు కాలేని వారి కోసం జూలై 21ని రిజర్వ్ డేగా కేటాయించారు. వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలని బోర్డు సూచించింది.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో మొత్తం 1,616 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి విడత కింద ఎనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. వీరికి ఇటీవలే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా అందజేశారు.

ఇప్పుడు తాజాగా మరో 500 పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల కావడంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, వెరిఫికేషన్ షెడ్యూల్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mhsrb.telangana.gov.in ను సందర్శించవచ్చు.

Follow Us